‘రాజవంశస్థుడు’ గా వస్తున్న రాంచరణ్

siri Madhukar
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘ధృవ’ సినిమా సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాలో నటించాడు.  ఈ సినిమా మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెంచుతూ వస్తుంది. సంవత్స కాలం షూటింగ్ పూర్తి చేసుకున్న రంగస్థలం 1985 నాటి పరిస్థితులు..రాజకీయాలు..ప్రేమలు..అనుబంధాలు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకులు సుకుమార్. 

ఇండస్ట్రీలో ఎంతో స్టైల్ గా కనిపించే రాంచరణ్, సమంతలు డిఫరెంట్ లుక్ లో చిట్టిబాబు, రామలక్ష్మిగా జీవించారు.  నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా అందరూ అద్భుతమైన నటనతో మెప్పించారు.  ఈ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ సాధించింది. రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకు టైటిల్‌ను ఖ‌రారు చేసె ప‌నిలో బిజీగా ఉన్నారు బోయ‌పాటి. ఇప్ప‌టికే ఈసినిమాకు ‘రాజవంశస్థుడు’ అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట. అంతే కాదు ఈ టైటిల్ విషయంలో కొంత కాలంగా తర్జన భర్జన జరిగిందట.

టైటిల్ విష‌యంలో చరణ్ తో పాటు చిరంజీవి .. అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో తమ ఆమోదాన్ని తెలియజేయవలసి ఉంటుంది. బోయపాటి ‘రాజవంశస్థుడు’ టైటిల్ ను అనుకుంటున్నట్టుగా ఇప్పటికే బయటికి వచ్చింది. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తే, అదే టైటిల్ ను చరణ్ వాళ్లు ఓకే చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: