ఫిలింనగర్ కాదు.. రెడ్ లైట్ ఏరియా..!?

Chakravarthi Kalyan
ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం.. ఆ అనుభవాల నిండా కన్నీళ్లే. అవమానాలే. 20 ఏళ్ల యువతి నుంచి 40 ఏళ్ల ఆంటీల వరకూ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూసి మోసపోయిన మహిళల ఆవేదన ఇదీ. తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీలపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుదీర్ఘ చర్చా కార్యక్రమం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఈ చర్చలో నటులు హేమ, సంధ్యానాయుడు, ప్రేమ, చంద్రముఖి, శ్రీవాణి, శిరీష, జయశ్రీ, పవిత్ర, జ్యోతిర్మయి, తేజస్విని, శోభిత, దివ్య, స్వరూప, రుక్మిణీరావు తదితరులు తమ గోడును వినిపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. వారి అనుభవాలు చూస్తే టాలీవుడ్ పైనే అసహ్యం వేసే పరిస్థితి ఉంది. ఇది టాలీవుడ్డా లేక రెడ్ లైట్ ఏరియానే అనే సందేహం కలుగుతోంది. 


తెలుగు సినీ రంగంలో మహిళా జూనియర్‌ ఆర్టిస్టులపై జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడీలు ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి మరోసారి తెలిశాయి. మహిళానటులను అడ్డుపెట్టుకుని కో-ఆర్డినేటర్లు, మేనేజర్లు, మధ్యవర్తులుగా వ్యవహరించేవారు చేసే అరాచకాలను వారు కళ్లకు కట్టినట్టు వివరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టులను, జూనియర్ ఆర్టిస్టులను, చిన్న నటులను ఎలా ట్రీట్ చేస్తారో వారు వివరిస్తుంటే సినీపరిశ్రమ మరీ ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించింది. 


సినీరంగంలో అవకాశాలు రావాలంటే కింది నుంచి పైస్థాయి వరకు కాస్ట్యూమ్‌, మేక్‌పమెన్‌, కెమెరామెన్‌, కో-డైరెక్టర్లకు అందరి ముందు లొంగి ఉండాల్సిందేనని.. అవసరమైతే వారి లైంగిక వాంఛలు తీర్చాలని వారు వెల్లడించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తమ గోడు పట్టించుకోవాలన్నారు మహిళానటులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: