రాంచరణ్ తో లిప్ లాక్.. చరిత్ర సృష్టించిన సమంత..!?

Chakravarthi Kalyan
రంగస్థలం సినిమాలో తన అద్వితీయమైన నటనతో సమంత హీరోకు దీటుగా పేరు తెచ్చుకుంటోంది. రంగ స్థలం గురించి మాట్లాడేవారు సమంత గురించి చర్చించకుండా ఉండలేని పరిస్థితి. ఓ పల్లెటూరి పిల్లలా.. పెద్దగా చదువుకోకపోయినా ఆత్మస్థైర్యం ఉన్న గడసరి పిల్లలా సమంత నటన సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టేసింది. ఆమె సహజ నటన సినిమాకు హైలెట్ గా మారింది. 


రంగమ్మా.. మంగమ్మా.. పాటలోనూ.. ఎంత సక్కంగున్నావో పాటలోనూ సమంతను చూసిన వారు ఆమె నటన తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుందని కితాబిస్తున్నారు. సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లను అంతగా ఆదరించిన చరిత్ర తెలుగు ప్రేక్షకులకు లేదు. కానీ సమంత ఇందుకు కొత్త మినహాయింపు తీసుకొచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా కథ ప్రకారమే నటించేందుకు ఆమె అంగీకరించింది. 



ప్రత్యేకించి రామ్ చరణ్ ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో అతనపై తన ప్రేమ చాటుకునేందుకు అకస్మాత్తుగా అతని పెద్దాలను గట్టిగా ముద్దు పెట్టుకుని తన ఇష్టాన్ని చెప్పకనే చెబుతుంది. ఆ సీన్ లో సమంత, రామ్ చరణ్ ల నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ముందు సమంత లిప్ లాక్ చేయడం.. ఆ తర్వాత రామ్ చరణ్ తిరిగి సమంతను లిప్ లాక్ చేయడం ఎక్కడా అసభ్యత ఫీల్ రాకుండా అద్భుతంగా ఉంటుంది. 



సాధారణంగా లిప్ లాక్ సీన్లంటే హీరో, హీరోయిన్ల ప్రేమ సన్నివేశాల్లో ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ లో హఠాత్తుగా లిప్ లాక్ సీన్ పెట్టేసి సుకుమార్ అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఆ సీన్ సినిమాకు ప్రాణంగా నిలిచింది.



పెళ్లయిన తర్వాత కూడా కథను బట్టి లిప్ లాక్ సీన్ చేసేందుకు వెనుకాడకుండా సమంత నటనకు తాను ఎంత ప్రాధాన్యమిస్తుందో చెప్పకనే చెప్పేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: