పాన్
ఇండియా స్టార్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్
మూవీ కల్కి 2898 ఏడి విడుదల తేదీని
మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. యంగ్ అండ్ టాలెంటెడ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన
కల్కి 2898 ఏడీ
మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.కల్కి 2898 ఏడీ
సినిమా జూన్ 27వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ విషయాన్ని
మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 27) అధికారింగా వెల్లడించింది. అంటే నేటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో ఈ
మూవీ విడుదల కానుంది.ఓ కొత్త
పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది
మూవీ యూనిట్. ఇందులో ప్రభాస్‍తో పాటు
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్ కూడా ఉన్నారు. యుద్ధరంగంలో వీరు ముగ్గురు కూడా నిల్చున్నట్టుగా ఈ
పోస్టర్ ఉంది. ఈ
పోస్టర్ క్వాలిటీ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. బ్యాక్‍గ్రౌండ్‍లో చక్రం నుంచి
ప్రభాస్,
అమితాబ్, దీపికా ఇంటెన్స్ లుక్ దాకా ఈ
పోస్టర్ అదిరిపోయింది.
ఈ మూవీని మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు
మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, ఎన్నికల వల్ల వాయిదా వేయకతప్పలేదు.ఇక కొత్త విడుదల తేదీపై చాలా ఆలోచనలు చేసింది
మూవీ టీమ్. పైగా గ్లోబల్ రేంజ్‍లో విడుదల చేయాల్సి ఉండటంతో తర్జనభర్జనలు పడింది. ఎట్టకేలకు
జూన్ 27న
కల్కి మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించింది.విష్ణుమూర్తి పదో అవతారం
కల్కి స్ఫూర్తితో ఈ మూవీలో
ప్రభాస్ పాత్ర ఉండనుంది. బైరవ అనే క్యారెక్టర్‌ను ఈ మూవీలో చేశారు రెబల్ స్టార్. కృష్ణుడి శాపం వల్ల మరణం లేక ఒంటి నిండా దెబ్బలతో అల్లాడుతున్న
మహా భారత యోధుడు అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. ఇటీవలే అశ్వత్థామ క్యారెక్టర్‌కు సంబంధించి ఓ గ్లింప్స్ రాగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ ఫ్రేమ్
హాలీవుడ్ రేంజ్‍లో ఉందంటూ ఎన్నో ప్రశంసలు వచ్చాయి. మహాభారతంతో మొదలై భవిష్యత్తు దాకా 6000 సంవత్సరాల కాలం ఈ మూవీలో ఉంటుందని దర్శకుడు నాగ్అశ్విన్ గతంలోనే చెప్పారు. సరిగ్గా ప్రమోషన్స్ చేస్తే
బాహుబలి 2,
దంగల్ రికార్డులు వన్ వీక్ లో లేచిపోతాయని
నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.