ఎన్నికల ప్రచారంలోకి దిగిన రాంచరణ్.. !

siri Madhukar
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు.  గత సంవత్సరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాలోచరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.  చిట్టిబాబు గా రాంచరణ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

పూర్తి తరహా గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా రూపొందినట్లు దర్శకుడు సుకుమార్ తెలుపుతున్నారు.  ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో ఆది, యాంకర్ అనసూయ, జగపతి బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఆది ఫస్టు లుక్ కూడా రిలీజ్ చేశారు.   ప్రస్తుతం రాంచరణ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారంటే..నిజంగా రాబోయే ఎన్నికల్లో బాబాయి తరుపు నుంచి అనుకుని తప్పులో కాలు వేస్తారేమో..అబ్బే..అంటే, ఇది రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో.

చరణ్ తాజా సినిమా ‘రంగస్థలం 1985’కు సంబంధించిన స్టిల్.  రంగస్థలం ఆది ది రాజకీయ నేత పాత్ర అని స్పష్టం అవుతోంది. ఆది తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ, చరణ్ పాంప్లేట్లు పంచే సీన్ కు సంబంధించిన స్టిల్ ఆసక్తిదాయకంగా ఉంది.తాజాగా విడుదల అయిన ‘రంగస్థలం’ స్టిల్స్ ఇది కూడా ఒకటి. ఈ టీజర్ దగ్గర నుంచి ఈ అట్మాస్పియరే జనాల్లో ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. దానికితోడు ఈ పొలిటికల్ టచ్ మరింత ఆసక్తిని రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: