అగమ్య గోచరంగా మారిన పవన్ వ్యూహం !

Seetha Sailaja

2018 ప్రారంభం నుంచే ఒకేసారి పవన్ తన కెరియర్ పరంగా అదేవిధంగా రాజకీయాల ఎత్తుగడల పరంగా సమాంతరంగా ఈ రెండు రంగాలలోను అంచనాలకు మించి పవన్ క్రేజ్ పడిపోతూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గత 2014 ఎన్నికలలో పవన్ పాపులారిటీ వల్ల తెలుగుదేశం గట్టెక్కింది అన్న ప్రచారాన్ని పవన్ అభిమానులు అత్యంత భారీ స్థాయిలో చేసిన విషయం తెలిసిందే.

 

అయితే అదే పవన్ అభిమానులు పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమా పై పవన్ ‘జనసేన’ రాజకీయాల పై చేస్తున్న కామెంట్స్ ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రెండు పడవల ప్రయాణం వద్దూ అంటూ చాలామంది అభిమానులు సలహాలు ఇస్తూ ఉంటే మరికొంతమంది పవన్ వీరాభిమానులు కొంత కాలం పవన్ తన సినిమాలకు విరామం ప్రకటిస్తే మంచిది అన్న అర్ధంలో కామెంట్స్ చేస్తున్నారు.

 

దీనికితోడు గత కొద్దిరోజులుగా పవన్ అభిమానులకు కత్తి మహేష్ కు రోజురోజుకు పెరిగిపోతున్న మాటల యుద్ధం ఛానల్స్ రేటింగ్స్ పెరగడానికి పనికి వస్తోంది కాని పవన్ పాపులారిటీని రోజురోజుకీ దిగజార్చి వేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ ఎంపరర్ గా పవన్ ను ఆకాశానికి ఎత్తేసిన మీడియా ఒకేసారి యూటర్న్ తీసుకుని పవన్ హవా అయిపోయిందా అంటూ ప్రసారం చేస్తున్న విశ్లేషణలు కామెంట్స్ పవన్ ఇమేజ్ ని మరింత దెబ్బ తీస్తున్నాయి.

 

ఏవిషయం పై అయినా వెంటనే స్పందించకుండా మౌనాన్ని కొనసాగించే పవన్ తన కెరియర్ పై అదేవిధంగా తన రాజకీయ ఎత్తుగడల పై కత్తి మహేష్ లాంటి వాళ్ళు చేస్తున్న మాటల దాడికి స్పందించకుండా ఇదే తరహా మౌనాన్ని చాల కాలం కొనసాగిస్తే ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్న గాసిప్పులు అన్నీ నిజాలుగా ప్రజలు అభిప్రాయపడే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాప్ హీరోల సినిమాలకు జయాపజయాలు సర్వసాధారణం అయితే కేవలం ఒక సినిమా ఘోరపరాజయాన్ని పవన్ కళ్యాణ్ టోటల్ కెరియర్ ఫెయిల్యూర్ గా చూపెడుతూ కొందరు వ్యక్తులు మరికొన్ని మీడియా వర్గాలు చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తక్కువగా అంచనా వేయడం పవన్ భవిష్యత్ లో నటించబోయే సినిమాల మార్కెట్ కు అదేవిధంగా రాజకీయంగా ఎదుగుదాముకుంటున్న ‘జనసేన’ కు ఏమాత్రం మంచిది కాదు అన్న భావనలో చాలామంది ఉన్నారు. కనీసం ఈ విషయాలనైనా పవన్ సీరియస్ గా తీసుకుంటాడో లేదో చూడాలి.. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: