అజ్ఞాతవాసి పై రాం గోపాల్ వర్మ ట్వీట్‌ - పవన్ ఫాన్స్ లో రగులుతున్న అగ్ని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, (ఈయన్ని ఇక నుండి 'కాపీ-కాట్' అని సంబోదిద్ధాం!) దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన అజ్ఞాతవాసి సినిమాపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌ లో వ్యంగోక్తులతో స్పందించాడు. అజ్ఞాతవాసి సినిమా పవన్‌ సినీ-కెరీర్‌ లోనే అత్యంత డిజాస్టర్‌ చిత్రమైన పులిని చూసినట్లుందని పరోక్షంగా సెటైర్లు వేశాడు. అంతే కాకుండా సినీవిమర్శకుడు అజ్ఞాతవాసిపై "మహేశ్‌ కత్తి రివ్యూ" బాగుందంటూ ఆయనకు కితాబిచ్చాడు.



"నేను పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్‌ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది" అని వ్యంగ్యంగా, చెణుకులు విసిరారు తన ట్వీట్‌ ద్వారా వర్మ. 
 
అంతేకాదు! చిత్ర విమర్శకుడు మహేశ్‌ కత్తి అజ్ఞాతవాసి సినిమా రివ్యూపై కూడా వర్మ తన దైన ప్రత్యేక శైలిలో స్పందించాడు. 

"ఇప్పుడే కత్తి రివ్యూ వీడియో చూశాను. పవన్‌ కళ్యాణ్‌ కన్నా మహెష్ కత్తి చాలా అందంగా కనిపించాడు" అని ట్వీట్‌ చేయగా - దీనికి మహేశ్‌ కత్తి తన హృదయ పూర్వక  కృతఙ్జతలు చెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమాని "జబర్ధస్త్‌ ఫేమ్‌ హైపర్‌ ఆది" మాత్రం "అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్లకాకి అన్నట్లుంది విరిద్దర్నీ చూస్తే" అంటూ మహేష్ కత్తి, రాం గోపాల్ వర్మపై జాయింటుగా సెటైరికల్ కామెంట్ చేశాడు. 


గత కొద్దిరోజులుగా మహేశ్‌ కత్తి, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం కురుక్షేత్రం స్థాయిలో జరుగుతున్న విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో మహేశ్‌ కత్తిని రాం గోపాల్ వర్మ పొగడటం పవన్‌ కళ్యాణ్ అభిమానుల గుండెల్లో  "అగ్నికి ఆజ్యం పోసి నట్లు - పుండు మీద కారం చల్లినట్లు"  ఫీలౌతున్నారు.


'అత్త తిట్టి నందుకు కాక తోడి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట ఓ ఉత్తమ ఇల్లాలు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక ప్రక్క వాసి లేని అజ్ఞాతవాసి ఫెయిలైందన్న భాద,  రావలసిన ధన రాసులు కోల్పోయిందన్న వ్యథ తో కుంగిపోయి ఉన్నారు. 


దీని కంటే వర్మ-కత్తి ట్వీట్‌ల పై రగిలి పోతున్నారు. అయితే వర్మ-కత్తి కామెంట్ల వర్షం ఇప్పుడు ఆగేలా లేదు - ఈ ట్వీట్లు సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అయ్యాయి, మొత్తం సోషల్ మీడియానే జాం చేసేలా ఉంది పరిస్థితి.



రూల్స్ ప్రక్కన బెట్తి ప్రత్యెక వెసుబాట్లు ఇచ్చిన ప్రభుత్వాల పరువు బజారుకెక్కగా, కాపీ కాట్ దెబ్బకు "పవర్ స్టార్ లో పవర్ పోయి స్టారే మిగలగా దాన్ని మడిచి ఎక్కడ పెట్టు కోవాలో"  తెలియని ఫాన్స్ "కత్తి-వర్మ" సలహా కోసం ఎదుచూస్తున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: