అజ్ఞాతవాసి బయ్యర్లకు హార్ట్ ఏటాక్ తప్పదా? నైజాం డిస్ట్రిబ్యూటర్ కు దెబ్బమీదదెబ్బ.

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్  దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబో మూవీ అనగానే డిస్ట్రిబ్యూటర్లు భారీ అంచనాలు పెట్టుకుని కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. కాని పరిస్థితి తారు మారు అయ్యింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించిన అజ్ఞాతవాసి పూర్తిగా వైఫల్య చిత్రమే నని అంటున్నారు. రాష్ట్రం లోని అన్ని ఏరియాల్లో మొత్తం కలిపి దాదాపు 150 కోట్ల వరకు ఈ చిత్రం బిజినెస్‌ చేసిందని సమాచారం ఉంది. 


ఇప్పుడు బయ్యర్లు బయట పడాలి అంటే తక్కువలో తక్కువ 150 కోట్ల వసూళ్ళు ఈ చిత్రం వసూళ్లు చేయవలసి ఉంటుంది. కాని ఆ లెవల్ లో వసూళు చేయడం అనేది దాదాపు అసాధ్యం అని మొదటి రోజు టాక్‌ తోనే తేలిపోయింది.


ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రం లాంగ్‌-రన్‌ లో లేదా ఫుల్-రన్ లో ₹ 150 కోట్లను వసూళ్లు సాధించక పోతే డిస్ట్రిబ్యూటర్లు అతి తీవ్ర నష్టాల్లో మునిగే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబ్యూటర్లు కూడా ఇప్పుడు భారీగా నష్టపోయే పరిస్థితులు వస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. సగానికి పైగా అంటే ₹ 75 కోట్లకు పైగా బయ్యర్లు నష్టపోవాల్సిందేనని, ఏరియా పరిమాణం బట్టి డిస్ట్రిబ్యూటర్‌ల నష్టపరిమాణం మారుతుందని, నైజాం ఏరియాతో పాటు ఉత్తరాంద్ర ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు అతి భారీ గా నష్టపోయే అవకాశం ఉందని సినిమా ట్రేడ్‌ పండితులు విశ్లేషకులు అంటున్నారు.


మొత్తానికి అజ్ఞాతవాసికి వస్తున్న మిక్డ్ టాక్‌ తో బయ్యర్లు గుండెల్లో రైళ్ళు పరుగెడు తున్నాయి. పవన్‌ కళ్యాణ్ సినిమా అనే నమ్మకంతో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లను పవన్‌ ఏమైనా ఆదుకుంటాడేమో ఇప్పటినుండే ఎదురుచూడాలి అంటున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాలు కాటమరాయుడు, సర్ధార్ గబ్బర్ సింఘ్ సినిమాలు బయ్యర్ల కొంప ముంచినా ఆయనపై అంత నమ్మకం పెట్టుకోవటంతో వాళ్ళపై సినిమా పండితులకు కనీస సానుబూతి కూదా ఉండనట్లు తెలుస్తుంది. 


దీనికి తోడు ఈ సినిమాకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కువ షోలు వేసుకోవటానికి వారం రోజుల పాటు ప్రత్యేక అనుమతి ఇచ్చినా ఆ వెసులు బాట్లు ప్రజల్లో అనేక చర్చలకు దారితీస్తున్నాయి. అజ్ఞాతవాసి బుధవారం రిలీజ్‌ అయిన పక్తు కమర్షియల్ సినిమా. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు పదో తేదీ నుంచి 17 వ తేదీ వరకూ ఆంధ్ర ప్రదేశ్ లో రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనల అనుమతి ఇవ్వకపోవడం ముఖ్యంగా ఈ సినిమాకు రాయితీ ఇవ్వడంపై చిత్రసీమ ప్రముఖులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అదనంగా ఒక్క షో కు మాత్రమే అనుమతినిచ్చినట్లు సమాచారం.  సమాజానికి మేలు చేసే సినిమాలకు సందేశం ఇచ్చే సినిమాలను, చారిత్రక సినిమాలను ప్రోత్సహించేందుకు అప్పుడప్పుడూ రాయితీలు ఇవ్వడం సహజమే. కమర్షియల్‌ సినిమాలకు ఏ ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన దాఖలాలు లేవు.


కానీ చంద్రబాబు ప్రభుత్వం తన బావమరిది, హిందూ పురం శాసనసభ్యుడైన నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణికి, పవన్ కళ్యాణ్ అఙ్జాతవాసి సినిమా లకు ప్రత్యేక వెసులుబాట్లు మినహాయింపులు ఇవ్వటంతో ప్రజల్లో ప్రభుత్వం కొందరి స్వంత కుటుంబ, పార్టీ వ్యాపారమైందని అసహనం వ్యక్తమౌతుంది. ఇంకా శైశవ దశలో ఉన్న జనసేన ప్రజలకు మేలు చెసే పార్టీ కాదని నిర్ద్వందంగా నమ్ముతున్నారు. చివరకు ఈ సినిమాతో పవన్‌ కళ్యాణ్ కు  సినిమా పోయింది,  ప్రజల్లో పరువూ పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మద్దతు పొంది వెసులుబాట్లిచ్చిన బాబు ప్రభుత్వం ప్రతిష్ఠ మరోసారి మసక బారింది.


అజ్ఞాతవాసి నైజాం రైట్స్ ను ఏకంగా 29కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు దిల్ రాజు. ఇప్పుడు ఆ సినిమా దిల్ రాజుకు చుక్కలు చూపెడుతోంది.నైజాంలో భారీ స్థాయిలో విడుదల చేయగా, మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో, ఈ పండగ రోజుల్లో వచ్చే వసూళ్లే పక్కా. ఈ సంక్రాంతి సీజన్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు ఆ తర్వాత సినిమా వసూళ్లు దాదాపు కష్టమే. ఇప్పటికే స్పైడర్ దెబ్బకు బలైన ఆయనకు మరోకలవరపాటు ఈ అఙ్జాతవాసి.

జై సింహా విడుదలకు సిద్ధం గా ఉండనే ఉంది. ఆ సినిమాకు కాస్తో కూస్తో పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం దిల్ రాజు కష్టా లు మరింత పెరుగుతాయి.దీనికి తోడు అర్థరాత్రి ప్రదర్శన లకు కేసీఆర్ సర్కార్ అనుమతి నిరాకరించడం కూడా దిల్ రాజు కు మరో ఎదురు దెబ్బ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: