కమెడియన్ విజయ్ భార్య అరెస్టుకు రంగం సిద్దం..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం అనుకొని ఎంతో మంది ఇండస్ట్రీకి రావాలని కోరకుంటారు.  అయితే ఇక్కడ కూడా ఎత్తు పల్లాలు ఉంటాయని వచ్చాక అర్థం అవుతుంది.  అదృష్టం బాగుంటే కెరీర్లో మంచి అవకాశాలు వస్తాయి..లేదంటే అంతే. అయితే కొంత మంది మంచి అవకాశాలు దక్కించుకొని కాస్త డబ్బు సంపాదించాక సినిమాలకు పెట్టుబడులు పెట్టి నిండా మునిగిన వారు చాలా మందే ఉన్నారు.  దీంతో భవిష్యత్ శూన్యంగా మారి ఏంచేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకున్నవారు కొందరైతే..సినిమాల్లో అవకాశాలు రాక చనిపోయిన వారు మరికొందరు.  

తెలుగు ఇండస్ట్రీలో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న విజయ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే తన ఆత్మహత్యకు తన భార్య వనిత కారణం అని సెల్ఫీ వీడియో లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  విజయ్ సెల్ఫీ వీడియోను మరణ వాంగ్మూలంగా తీసుకున్న పోలీసులు, వనితను అదుపులోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. 

విజయసాయి ఆత్మహత్య కేసులో అతని భార్య వనిత అరెస్ట్‌కు పోలీసులు సిద్ధమయ్యారు.  అయితే ఆత్మహత్యకు ముందు రోజు వనిత తన కారును బలవంతంగా తీసుకెళ్లిందని విజయ్ సాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో అసలు కారును ఎందుకు బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, తదితర కోణాలను వనిత దగ్గరనుండి రాబట్టాలని పోలీసులు చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: