లైంగిక వేదింపులు ఒక్క చిత్ర పరిశ్రమ లోనే ఉన్నాయా?

లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలకు వేయటానికి సంబంధించిన సమగ్ర చట్టం భారత దేశంలో ఇంకా రూపొంద లేదనే చెప్పాలి. వేధింపులకు శిక్షలు ఉన్నా, వేధింపులు జరిగినట్టు ఋజువు చేసేందుకు సాక్ష్యాధారాలు చూపించగల పరి స్థితులు లేకపోవడంతో అవన్నీ కోర్టుల ముందు నిలవలేక వీగి పోతున్నాయి. పోలీసు కస్టడీలో నాలుగు గోడల మధ్య జరిగే వేధింపులను కూడా బాధితుడు / భాదితురాలు ఋజువు చేసుకునే స్థితి ఎన్నడూ లేకపోవడంతో యధేచ్ఛగా వేధింపులు జరుగుతున్నాయి. 


అంతా తెలిసినా చట్టం ముందు సరైన ఆధారాలను చూపలేక బలహీనులుగా ఉండిపోతున్నారు. న్యాయస్థానాలు సైతం ఏదో జరిగిందనే భావనతో ఉన్నా శిక్షలు వేసేందుకు సరిపడా ఆధారాలు లేక నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. అయినా సినిమా రంగంలో ముఖ్యంగా కొన్నిసందర్బాల్లో మహిళలకు అవకాశాలు ఇవ్వటానికి ముందు అవసరాలు తీర్చాలనే నిబంధన ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఆవిషయాలు క్రమంగా బాధితురాళ్ళు వ్యక్త పరచటం రోజువారీ రివాజుగా మారి పోయింది.




అయితే లైంగిక వేధింపులు కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో ఈ పరిస్థితులున్నాయని బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. "కాస్టింగ్‌ కౌచ్‌" కు సంబంధించి ఇటీవల హాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూడగా, ఆ వెంటనే బాలీవుడ్‌ నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పదిమందికి వివరిస్తున్నారు - షేర్‌ చేసుకుంటున్నారు. 


తాజాగా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఒక దర్శకుడు తాగొచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి స్వర భాస్కర్‌ ఆరోపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  ఈ లైంగిక వేధింపులపై బాలీవుడ్ కథానాయకుడు ఫర్హాన్‌ అక్తర్‌ స్పందిస్తూ


,..................."కేవలం ఫిల్మ్‌ ఇండస్ట్రీని బలిచేయడం సరికాదు. అన్ని రంగాల్లో వేధింపులు జరుగుతున్నాయి. బాధిత మహిళ లు, యువతులు ఏదో రూపంలో ధైర్యంగా వారికి ఎదురైన విషయంపై బహిర్గం చేసి పోరాటం కొనసాగించాలి. ఈ విషయంలో వారికి పూర్తి మద్ధతు తెలుపుతా. లింగభేదం లేనప్పుడే సమాజం మరింత ముందుకు వెళ్తుంది. మహిళ లపై వేధింపులకే పాల్పడేవాళ్లను అంత తేలికగా విడిచిపెట్టొద్దు. నా సినిమాల్లో అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తాను. అంతే కానీ పలానా మహిళ బాధితురాలంటూ వ్యత్యాసం చూపనని".................... వెల్లడించారు. 


మహిళలపై వేధింపులు అడ్డుకోవాలంటూ వారికోసం పోరాటం చేసే వ్యక్తులలో ఫర్హాన్‌ అక్తర్‌ ఒకరు. తన సినిమాల్లో హీరోలకు ఇచ్చేంత పారితోషికమే హీరోయిన్లకు ఇస్తా నంటూ గతంలో పలుమార్లు చెప్పి లింగ వ్యత్యాసం చూపడాన్ని వ్యతిరేకించాడు దర్శకనిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌. ఇలాంటి వాళ్ళు స్పందిస్తూ ఉంటే కొంత కాలానికైనా సినీ పరిశ్రమలో మార్పు రావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: