టాలీవుడ్ కింగ్ నాగార్జున - సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రాజు గారి గది 2 సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. నాగార్జున, సమంత లాంటి స్టార్ కాస్టింగ్ ఉండడంతో పాటు ముందునుంచి భారీగా ప్రమోషన్లు నిర్వహించడంతో ఈ సినిమాకు తొలి రోజు వరల్ఢ్వైడ్గా అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో అయితే గది కళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది.
ఓం కార్ ఈ చిత్రానికి దర్శకుడు. హర్రర్ కామెడీ గా వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, సమంతల పాత్రలు అలరించాయి. తొలిరోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల వసూళ్లు సాధించింది. ఏరియాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజే ఈ సినిమాకు రూ.4 కోట్ల షేర్ వచ్చిందంటే ఫస్ట్ వీకెండ్కు ఇంకా మంచి షేర్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజు గారి గది 2 ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 1.51
సీడెడ్ - 0.51
నెల్లూరు - 0.14
గుంటూరు - 0.47
కృష్ణా -0.27
వెస్ట్ - 0.26
ఈస్ట్ - 0.36
వైజాగ్ -0.41
--------------------------------
మొత్తం షేర్ = 3.93 కోట్లు
--------------------------------