బాహుబలి బృందానికి దుబాయ్ ఏయిర్పోర్టులో ధారుణ అవమానం.

   



ప్రపంచం లో మొదటి రెండవ ప్రపంచ యుద్దకాలము నాటి వాతావరణం శరవేగంగా అలుముకుంటూంది. ఒకరిని ఒకరు, ఒక పొరుగుని ఇరుగు, ఒకదేశాన్ని మరోదేశం జాత్యహంకారం పేరుతో తలపడటానికి సిద్ధమనవటం చూస్తుంటే జాతుల హననం ఇంకెంతో దూరంలో లేదని పిస్తుంది. ముఖ్యంగా అనెకచోట్ల విమానాశ్రయ సిబ్బందిలో వినాశకర ధోరణులు ప్రబలుతున్నాయి బాహుబలి టీంకి దుబాయ్ విమానాశ్రయములో ఎదురైన చేదు అనుభవం మరో ఉదాహరణ 


బాహుబలి బృందం రాజమౌళి , ప్రభాస్ , అనుష్క నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులకు దుబాయ్ లో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల చిత్ర యూనిట్ దుబాయ్ లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమం చేసిన సంగతి తెల్సిందే, ఈ సందర్భంగా అక్కడికి నుండి చిత్ర యూనిట్ హైదరాబాద్‌ కు ఎమిరేట్స్‌ విమానంలో బయలుదేరారు. వారంతా దుబాఇ ఎయిర్‌పోర్ట్‌ గేట్‌ వద్దకు చేరు కోగానే విమాన సిబ్బంది చిత్ర బృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారట. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.


"ఎమిరేట్స్‌ ఈకే 526 విమానంలో హైదరాబాద్‌ బయలుదేరాం. గేట్‌ వద్ద ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవ ర్తించారు. అందులో ఒక వ్యక్తి మాపై జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్‌ విమానం లో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి" అని ఆగ్రహం వెలిబుచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: