అనుష్కకు ప్రత్యామ్నాయం అనుష్కే




ఒకనాడు తాండ్ర పాపారాయుడు, విశ్వనాథనాయకుడు, సింహసనం లాంటి సినిమాల్లో దీరోధాత్త కథానాయకునికి సరిజోడీగా నటించటానికి మనకు జయప్రద ఒక అభిసారికలా కనిపించేది. ఆ సొగసు, సోయగం, నయగారం, సింగారం, వగలు, హొయలే కాదు హంసనడకలతో కథానాయకులను అల్లల్లాడించి ప్రేక్షక ప్రపంచానికి నిద్దురపట్టనివ్వలేదు. అందుకే ఆనాడు ఆ సినిమా లన్నీ విజయవిహారం చేసేవి. 





అనుకోకుండా ధిగ్గజ దర్శకుడు రాజమౌళి చారిత్రాత్మక కథలవైపు పరుగులు పెట్టటం ఆ సినిమాలకు మార్గదర్శనం చేయటంతో మళ్ళా ఆ స్థాయి నట నటీమణుల అవసరం పెరగటంతో అన్వేషణ మొదలైంది. కథానాయకుడు గా ప్రభాస్, ప్రతినాయకుడుగా రాణా ధీర్ఘ బాహువులతో, హిమోన్నతమైన అజానుబాహులు దొరికారు. అలాగే ఆణిముత్యంలాంటి అనుష్కా-షెట్టి కథానాయకిగా లభించింది. 





అమె లో ఆనాటి జయప్రద కున్న పై సుగుణాలతో పాటు అద్భుతంగా రాజసం పండించే పొడగరి కావటములో మరింత ధీటైన గెయిటీ తో తన సొగసులనే కాదు ధీరతను ప్రదర్శించే ధీరజ నేత్రి కాగలిగింది. ఆమెకు సరైన ప్రత్యామ్నాయం దొరకటం కష్టం. దొరికినా ఇన్ని రాసులు పోసిన అందాలతో నిండైన రూపం వెండితెరపై వేరొకర్ని ఊహించలేము. 


"సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరని ఇంద్రధనస్సులా మార్చేస్తారు దర్శకులు. అందులో నేనొక రంగులా కనిపించాలని ఆశ పడతానంతే" అంటోందిట అనుష్క. ఓ వైపు నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తూనే, మరోవైపు కథానాయికగా కమర్షియల్‌ చిత్రాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ "బాహుబలి: ది కన్‌క్లూజన్‌" పైనే. "కథానాయిక" ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తానని తానేనెప్పుడూ అనుకోలేదట. తనంతట తాను కోరుకోలేదట. 





తనను, తన నటనను నమ్మిన దర్శకులు, నిర్మాతలూ ఉన్నారు కాబట్టే తను ఆ దారిలో ప్రయాణించగలిగానంటూంది స్వీటీ. నిజం చెప్పాలంటే కమర్షియల్‌ కథల్లో నటించడమే హాయి. పాత్రల కోసం పెద్దగా కసరత్తులు చేయనవసరం లేదు. ఆహార్యం కోసం నిరంతరం కష్టపడక్కర్లేదు. హాయిగా పిక్నిక్‌కి వెళ్లి హాయిగా వచ్చినట్టుంటుంది అంటుంది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటములోని మధుర్యాన్ని మనకందించే అనుష్క.

కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల తీరే వేరుగా ఉంటుంది. ఒక సినిమా చేస్తే పది చిత్రాల అనుభవం సంపాదించొచ్చు. దేని ప్రత్యేకత దానిదే. "సినిమా అంతా నేనే మోయాలి అన్న తపనకు తాను చాలా దూరమని, అన్ని సన్నివేశాల్లోనూ నేనే కనిపించాలి అని తాను ఎప్పుడూ అనుకోను" అంటుంది అనుష్క. తెరపై కనిపించే సప్త వర్ణ సంశోభితాల్లో తానొక రంగు మాత్రమే" అని చెప్పింది అనుష్క వినమ్రంగా. ఈ వినమ్రత కూడా ఆమె సుగుణాలకు మరో సౌంధర్యాన్ని ఆపాదిస్తుంది. 




మాయాబజార్-శశిరేఖ లో సావిత్రిని, శ్రీ కృష్ణ తులాభారం-సత్యభామ లో జమునని, లవకుశ-సీత లో అంజలిని తప్ప వేరే వారిని ఊహించగలమా! అలాగే అనుష్క ఒక ప్రబంధ నాయకిగా ఒక  రుద్రమదేవిగా, దేవసేన గా (బాహుబలి)  చారిత్రాత్మక, అవకాశం ఉండి నటిస్తే   పౌరాణిక పాత్రల్లోనూ  ఇమిడిపోగలదు.  తెలుగువారికి గుర్తుండి పోగలదనటంలో సందేహం లేదు.


నిలువెత్తు వయ్యారం నయగారం, సోయగం, సౌందర్యం కలబోత  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: