వంద కోట్ల క్లబ్ లో ‘కాటమరాయుడు’..!

Edari Rama Krishna
గత సంవత్సరం ఉగాది రోజున భారీ అంచనాల మద్య  పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ అయ్యింది. కానీ అనుకున్న అంచనాలు తలకిందులు చేసి అపజయాన్ని మూటకట్టుకుంది.  ఆ తర్వాత గోపాల గోపాల డైరెక్టర్ డాలీ తో పవన్ కళ్యా ‘కాటమరాయుడు’ చిత్రంతో నటించారు.  ఈ చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి..రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది కాటమరాయుడు.

మార్చి 24 న రిలీజ్ అయిన ఈ చిత్రం 42 కోట్ల వసూళ్ల ని సాధించగా రెండో రోజు 30 కోట్లని , మూడో రోజైన ఆదివారం రోజున 28కోట్లని వసూల్ చేయడంతో మొత్తంగా మూడు రోజుల్లోనే 100 కోట్ల మైలురాయి ని అందుకున్నాడు పవన్.  అయితే ఈ చిత్రం తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన ‘వీరం’ ని రిమేక్ చేసిన విషయం తెలిసిందే.  రిలీజ్ అయిన మొదటి రోజు సినిమాపై రక రకాలు పుకార్లు పుట్టుకొచ్చాయి.  

అంతే కాదు ఈ చిత్రంపై  డివైడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ వసూళ్ల లో మాత్రం దూసుకు పోతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక , చెన్నై , ఓవర్ సీస్ లలో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తున్నాడు కాటమరాయుడు.  సినిమాపై ఎన్ని విమర్శలు వస్తున్నా..చిత్ర యూనిట్ మాత్రం వీటన్నింటిని కొట్టి పడుస్తున్నారు.కాటమరాయుడు తో పవన్ స్టామినా ఏంటో నిరూపించుకున్నారని రాబోయే రెండుమూడు రోజుల్లో మరిన్ని కలెక్షన్లు వస్తాయని అంటున్నారు.  

అయితే ఈ వీక్ ఎండ్ లో వెంకటేష్ నటించిన గురు, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన రోగ్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.  మరి ఈ రెండు సినిమాలు మంచి హిట్ అయితే కాటమరాయుడు పై ఏవైనా ఎఫెక్ట్ పడుతుందా..? లేదా చూడాలి. డాలి దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా శృతి హాసన్ పవన్ సరసన నటించింది . ఇక పవన్ తమ్ముల్లుగా శివబాలాజీ , అజయ్ , కమల్ కామరాజు , కృష్ణ చైతన్య లు నటించారు.


కాటమరాయుడు ఏరియావైజ్ కలెక్షన్లు :


నైజాం :   


సీడెడ్ : 5.1 కోట్లు


ఉత్తరాంధ్ర : 


ఈస్ట్ : 4.24 కోట్లు


వెస్ట్ :3.41 కోట్లు


కృష్ణ : 2.56 కోట్లు


గుంటూరు : 3.77 కోట్లు


నెల్లూరు : 1.6 కోట్లు


ఏపీ +నైజాం : 


అయితే వరల్డ్ వైడ్ గా కాటమరాయుడు కి సంబంధించిన కలెక్షన్లు గురించి వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: