చిన్న హీరోతో బోయపాటి చెలగాటం
ఇదిలా ఉంటే తాజాగా బోయపాటి శ్రీను తన అప్ కమింగ్ మూవీపై ప్రత్యేకమైన శ్రద్ధని చూపిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రంతో హిట్ కొట్టిన బోయపాటి, ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ మూవీని రెడీ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఎన్టీఆర్ తో సినిమాని చేస్తాడని అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ తన ‘జనతా గ్యారేజ్’ హిట్టవ్వడంతో ఈసారి కోలీవుడ్ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
దీంతో బోయపాటి, ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక బోయపాటి చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ తోనే జతకట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ జరుపుకుంది. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి ఓ పవర్ఫుల్ కథని చేయనున్నట్టుగా తెలుస్తుంది.
అయితే కొంత మంది మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి తెరకెక్కించే కథ హీరో వయస్సుకి మించిన కథ అని అంటున్నారు. ఒక వేళ ఈ సినిమా హిట్టయితే ఓ రేంజ్ లో ఉంటుందని...లేకపోతే మాత్రం శ్రీనివాస్ కి కొంత కష్టాలు తప్పవని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం చిత్రటీం ఈ మూవీపై కసరత్తులు చేస్తుంది.