డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిన పవన్ వినలేదు

E. Rama Krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పటీ...మరో మూడు నెలల్లో షూటింగ్ ని పూర్తి చేయాలని డైరెక్టర్ డాలీ భావించాడు. అయితే తాజాగా జరిగిన పవన్ అభిమాని హత్య ఘటన తరువాత... పవన్ కళ్యాణ్ పూర్తిగా తన అప్ కమూవీ షెడ్యూల్స్ ని మార్చాడని అంటున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలకి సంబంధించిన బిజిలో ఉండటం వల్ల...సర్ధార్ గబ్భర్ సింగ్ మూవీకి సంబంధించిన షూటింగ్ సైతం దాదాపు సంవత్సరం పైగా ఆలస్యం అయింది. ఇప్పడు అదే విధంగా తన అప్ కమింగ్ మూవీ సైతం ఆలస్యం కానుందనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా ప్రారంభం కావాల్సిన షూటింగ్ షెడ్యూల్ ఇప్పడు పోస్ట్ పోన్ చేసుకుంది. వినోద్ రాయల్ హత్యతో ఇది కాస్త ఇంకా దూరంగా జరిగిందని అంటున్నారు. వినోద్ రాయల్ కి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ బాగా డిస్ట్రిబ్ అయ్యాడని అంటున్నారు.

ఇది ఎందుకు జరిగింది, చేసిన దానికి ఎవరు వెనక ఉన్నారు..అలాగే ఇంకెంత మందిని టార్గెట్ చేశారు? వంటి విషయాలపై పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను చేయబోతున్న షూటింగ్ షెడ్యూల్ ని అనూహ్యంగా నిలిపేశారు. చాలా తర్వగా మూవీని పూర్తి చేయాలనుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు దీన్ని దూరం పెట్టడం అనేది డైరెక్టర్ కి ఎంత మాత్రం ఇష్టం లేదని అంటున్నారు.

దీంతో షూటింగ్ కాస్త పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనే దానిపై చిత్ర యూనిట్ వద్ద స్పష్టత కనిపించటం లేదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో పెట్టిన మీటింగ్ హడావిడిని చూస్తుంటే రాజకీయాల్లో పెద్ద దుమారమే చెలరేగిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉండనుందో మరి కొద్ది సేపట్లో తెలియనున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: