ఏపీ: పతాక స్థాయికి చేరిన మాటల యుద్ధం?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు కూటమికి సారథ్యం వహిస్తున్నారు. అయితే కూటమితో వస్తున్నా వైసీపీ సోలోగా వస్తున్నా.. ఫైట్ మాత్రం ఇంకా టఫ్ గానే ఉంది. గెలుపు ఎవరిది అంటే ఇకా క్లారిటీ రావడం లేదు. అయితే అటు వైసీపీకి, ఇటు టీడీపీకి చేతిలో ఏమైనా అస్త్రాలు ఉన్నాయా అంటే మ్యానిఫెస్టో విడుదలతో అది కూడా అయిపోయింది.

మొత్తం మీద ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నా.. ఏదో మిస్ అయినట్లు కనిపిస్తోంది. ఓటర్లు ఇంకా ఎవరికీ ఓటు వేయాలనే మీమాంసలోనే ఉన్నారు. ఈక్రమంలో తటస్థ ఓటర్లను మార్చేందుకు ఇటు ఎల్లో మీడియా .. అటు వైసీపీ పత్రిక తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల్లో ఒక రకమైన సెంటిమెంట్ ను రగల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆయా పార్టీల నాయకులు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ పత్రికల్లో ప్రచురించేస్తున్నాయి.

ఇక తాజాగా చూసుకుంటే టీడీపీ ప్రతిపాడు అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాటలను వైసీపీ పత్రిక వక్రీకరించి ఒక వార్తను ప్రచురితం చేసింది. చంద్రబాబు నాయుడు మొదలుకొని.. టీడీపీ నేతల వరకు అంతా  దళిత ద్వేషులని మరో నాయకుడు నిరూపించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరకుంటారు అంటూ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు మాట్లాడారు.   ఆ పార్టీలోని పలువురు నాయకులు దళితులపై దాడి చేసిన ఘటనలు కోకొల్లలు.

ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దళిత నాయకుల గురించి అతి నీచంగా మాట్లాడారు. గంజాయి తాగే కొడుకులు అంటూ ఆయన మాట్లాడిన మాటలపై దళిత సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అంటే జగన్ పాలన లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. అందువల్ల యువత పెడదారి పడుతోంది. ప్రతి కుటుంబంలో గంజాయి తాగే కొడుకులుంటారు. వీరికి అర్ధరాత్రి పిచ్చి లేస్తే తల్లిదండ్రులపై  కత్తి పెట్టి చంపేసినా చంపేస్తారు అంటూ మాట్లాడితే.. ఏకంగా దళితులందర్నీ తిట్టినట్లు బ్లూ మీడియా పత్రిక వక్రీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: