మహేష్ బాబు, రాజమౌళి మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
ఏ స్టార్ హీరో అయినా సరే సినిమాలు లేకపోతే వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారు. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలని చూస్తూ ఉంటారు. కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఎటువంటి సినిమాలు చేసిన చెయ్యకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు అని చెప్పొచ్చు. అయితే తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా

 కమర్షియల్ గా పెద్దగా హిట్ అందుకోలేక పోయినప్పటికీ మంచి టాక్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నాటించింది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా స్టార్ట్ కావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మహేష్ బాబు

 ప్రస్తుతం పలు యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే తన ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళితో సినిమా చేసే కంటే ముందే తనకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుంటున్నాడు.  ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలేమీ చెయ్యకపోయినప్పటికీ ఫోటోషూట్స్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అని చెప్పాలి. ప్రతి 15 రోజులకి ఒకసారి సోషల్ మీడియాలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే తాజాగా మరొకసారి ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపించాడు మహేష్ బాబు. అయితే ఈసారి ఫోటోషూట్స్ ఏమీ చేయలేదు కానీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించాడు. దీంతో ప్రస్తుతం ఇదే లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొడవాటి జుట్టుతో మహేష్ బాబు అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా మహేష్ లుక్ బయటపడడంతో అందరూ రాజమౌళితో సినిమా కోసమే మహేష్ బాబు పూర్తిగా మారిపోయాడు అన్న కామెంట్లు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: