భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తమిళంలో సూపర్‌స్టార్ విక్రమ్‌తో రూపొందించిన విభిన్నమైన చిత్రం 'ఐ' గుర్తున్న వారందరికీ అందులో విలన్‌గా మెప్పించిన ఉపేన్ పటేల్ కూడా కచ్చితంగా గుర్తుంటాడు. తమిళంలో ఓ చిత్రం చేసిన ఈ బాలీవుడ్ కుర్ర విలన్ ఇప్పుడు తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆది హీరోగా రూపొందుతున్న చుట్టాలబ్బాయి చిత్రంలో విలన్ వేషానికి యూనిట్ ఉపేన్ పటేల్‌ను ఎంపిక చేసుకున్నారు.
'ఐ' చిత్రం విలన్.. ఇందులో విలన్‌గా చేస్తున్నాడంటేనే.. చిత్రానికి ఎంతో కొంత హైప్ క్రియేట్ కావడం తథ్యం. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్‌కు ఎలాంటి నటుడు కావాలని మేం వెతుకుతున్నామో.. ఆ లక్షణాలన్నీ ఉపేన్ పటేల్‌లో సరిగ్గా ఉన్నాయని అనిపించింది. పైగా అతనితో చేయడం వలన సినిమా వేల్యూకూడా పెరుగుతుంది అని దర్శకుడు వీరభద్రం అంటున్నారు. ఐ చిత్రం ద్వారా తనకు దక్షిణాది లో కూడా పలు అవకాశాలు వస్తున్నాయని ఉపేన్ మురిసిపోతున్నాడట. ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మళయాళీ అమ్మాయి నమిత ప్రమోద్ హీరోయిన్గా చేస్తోంది.
తెలుగులో ఇంకా పూర్తిస్థాయిలో తన సత్తా ఏమిటో నిరూపించుకోలేని స్థితిలో కిందా మీదా పడుతూ చిత్రాలు చేస్తూ ఉన్న ఆది.. తన స్థాయికి మించిన విలన్ని తెచ్చి పెట్టుకుంటే.. సినిమా ఎటు పోయినా.. పేరు మొత్తం విలన్‌కే దక్కుతుందేమోననే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తమవుతోంది. కుర్ర హీరో ఆదికి బాలీవుడ్‌నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉపెన్ పటేల్.. స్థాయికి మించిన విలన్ అయిపోతాడేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.