గేమ్ ఛేంజర్ రివ్యూ: ఎలక్షన్ కమీషన్ పూర్తి పవర్ వాడితే ఎలా ఉంటాదో తెలుసా.?

FARMANULLA SHAIK
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. ఆలస్యాలతో సుమారు నాలుగేళ్లు షూటింగ్ సాగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెర్రీ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత మూవీ రావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. పాన్ ఇండియా మరోసారి స్టార్ డమ్ నిరూపించుకునేందుకు బరిలోకి దిగాడు. చాలా ఏళ్లుగా తన స్థాయి విజయం లేని దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ గేమ్ ఛేంజర్ మూవీతో తన పూర్వవైభవం చూపిస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నే శంకర్ మూవీస్ కు ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక థీమ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా అదే కథాంశంగా ఉంటాయి ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అలానే ఉంటుంది అంటున్నారు.మొదటి ఆట ముగిశాక రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ నడుస్తోంది. శంకర్ అన్ని సినిమాల్లాఏ ఉందని కొందరు అంటే..బావుందని మరి కొందరు అంటున్నారు.భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ ఈరోజు విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్లో రాత్రి ఒంటి గంట షో పడింది. తెలంగాణలో తెల్లవారు జామున నాలుగు గంటల ఆట వేశారు. అయితే సినిమా ఎలా ఉన్నా రామ్ చరణ్కు మాత్రం ఫుల్ మార్కులు పడిపోయాయి. కానీ శంకర్ మేకింగ్ మాత్రం బాలేదని అంటున్నారు. 

ఇంతకు ముందు ఆయన సినిమాల్లా లేదని అంటున్నారు. పాటలు మాత్రం వినడానికి, పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. రా మచ్చా మచ్చా పాట సూపర్గా ఉందని అంటున్నారు.ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్గా యావరేజ్గా ఉందని..కొన్ని ఐఏఎస్ బ్లాక్లు మాత్రం బావున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుందని అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుందని చెప్పారు. చరణ్, కియారాల మధ్య లవ్ స్టోరీ ఏం బాలేదని..సినిమాకు అదే మైనస్ అవ్వొచ్చని ఫ్యాన్స్ చెబుతున్నారు. తమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద బలం అంటున్నారు. తమన్ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్పై హైప్ పెంచేలా ఇంటర్వెల్ సీన్ ఉందని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.ఇదిలావుండగా ఎన్నికల సంఘం పూర్తి పవర్ వాడితే ఎలక్షన్లను ఎంత పకడ్బందీగా నిర్వహించవచ్చో అనే అంశాన్ని సెకండాఫ్‍లో చూపించారు శంకర్. రాజకీయ నాయకులను ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కట్టడి చేయొచ్చో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వ్యవస్థకు, జనాలకు, రాజకీయ పార్టీలకు సందేశాన్ని కూడా ఇచ్చారు. అయితే, ఇది మరింత ప్రభావంతంగా చూపించి ఉండే బాగా కనెక్ట్ అయి ఉండేది. మొత్తంగా ఫస్టాఫ్‍తో పోలిస్తే.. సెకండాఫ్ మెరుగ్గా అనిపిస్తుంది.చివర్లో పథకాల గురించి రామ్‍నందన్ చెప్పడం.. ఇప్పటి రాజకీయ నేతలకు సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.ఓవరాల్ గా గేమ్ ఛేంజర్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: