గేమ్ ఛేంజ‌ర్ : చరణ్‌ కెరీర్‌ లో మొదటిసారి..ఆ రికార్డ్‌ బ్రేక్‌ ?

Veldandi Saikiran
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాతో రేపు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రెండు పాత్రలో కనిపించానున్నాడు. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.
 

అలాగే ఈ సినిమాలో... కియారా అద్వానీతోపాటు... తెలుగు హీరోయిన్ అంజలి కూడా నటించింది. ఈ సినిమాకు దర్శకత్వం శంకర్ వహించారు.  అయితే ఈ సినిమాను  దిల్ రాజ్... దాదాపు 500 కోట్లు పెట్టి తీసారు.  ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన  రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా... అరుదైన రికార్డు సొంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ చేసిన గేమ్ చేoజర్ సినిమా మొదటి రోజు... 80 నుంచి 90 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే రామ్ చరణ్.... శంకర్ కెరియర్లో... 90 కోట్లు వస్తే... ఇదే తొలి సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఈ సినిమా ఆదిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  మరి... ఇవాళ... ఉదయం రిలీజ్ అయిన ఈ సినిమా.... 24 గంటల్లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

 

సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమా... మరో రోజులపాటు ఇదే తరహాలో కలెక్షన్స్ రాబడితే... 1000 కోట్లు దాటావచ్చు. పుష్పాలాంటి సినిమా తర్వాత  అంతటి అంచనాల మధ్య  ఈ సినిమా వస్తోంది. అందుకే మెగా ఫ్యాన్స్... ఈ సినిమా హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రూ.100 కోట్లకు పైగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: