రైట్ రైట్ : రివ్యూ
కొత్తగా కండక్టర్ జాబ్ లో జాయిన అయిన రవి (సుమంత్ అశ్విన్) ఎస్.కోట డిపో నుండి గవిటికి బస్ రూట్ లో వెళ్తుంటాడు. ఇక బస్ డ్రైవర్ గా శేషు (ప్రభాకర్) ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాడు. డ్రైవర్, కండక్టర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే గవిటిలో కళ్యాణి (పూజా జవేరి)తో ప్రేమలో పడతాడు రవి. అదే ఊరిలో విశ్వనాధం (నాజర్) పెద్ద మనిషి ఉంటాడు. రిటైర్డ్ టీచర్ గా ఉన్న ఆయన తన స్నేహితుడి కూతురు అమృత (పావని గంగిరెడ్డి)ని కొడుకు దేవాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. అయితే దేవ అనుకోకుండా సూరత్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ యాక్సిడెంట్ కూడా బస్ కండెక్టర్, డ్రైవర్ వల్లే జరుగుతుంది. రక్తంతో తడిసిన దేవను హాస్పిటల్ కు తీసెకెళ్లమని ఓ వ్యక్తికి అప్పగించగా అతను దేవను లోయలో పడేస్తాడు. అసలు దేవను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది..? విశ్వనాధ్ కు నమ్మిన బంటుగా ఉన్న భద్ర ఏం చేశాడు..? కళ్యాణిని రవి పెళ్లి చేసుకున్నాడా..? అన్నది అసలు కథ.
రైట్ రైట్ అంటూ వచ్చిన సుమంత్ అశ్విన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దామని ప్రయత్నించాడు. అయితే తన పాత్ర వరకు పర్వాలేదనిపించిన సుమంత్ సినిమాకు హిట్ కావాల్సిన అంశాలను మిస్ చేసుకున్నాడు. కేరింత తర్వాత చేసిన ఈ సినిమాలో రవి పాత్రకు న్యాయం చేసినా సినిమా మాత్రం సుమంత్ కు బ్యాడ్ ఇమేజ్ తీసుకు వస్తుంది. ఇక హీరోయిన్ కళ్యాణిగా నటించిన పూజా జవేరి పర్వాలేదు కాని ఆమెకు సినిమాలో ఎక్కువ స్కోప్ లేకుండా పోయింది. సీనియర్ నటుడు నాజర్ సినిమాకు కాస్త హెల్ప్ అయ్యారు. ఆయన సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక విలన్ గా చేసిన భద్ర మంచి నటన కనబరిచాడు. ఇక ముఖ్యంగా సినిమాలో హీరో పక్కన బస్ డ్రైవర్ గా బాహుబలి ప్రభాకర్ సినిమా మొత్తం ఉన్నాడు. తనలోని నటన బయటకు తీసే ప్రయత్నంలో ఓ మంచి రోల్ ప్లే చేశాడు ప్రభాకర్. ఇంకా వీరే కాకుండా రావు రమేష్, జీవా చిన్న చిన్న పాత్రలు వేసి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సినిమా దర్శకుడు మను సినిమా నీట్ గా ప్రెజెంట్ చేశాడు కాని ఎంటర్టైన్ మాత్రం చేయలేకపోయాడు. ఓ మలయాళ సినిమాను ఆ ఫీల్ మిస్ అవ్వకుండా సినిమా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ఇక ఈ సినిమాలో బెస్ట్ అన్నది ఏదన్నా ఉంది అంటే అది కెమెరామన్ శేఖర్ వి జోసెఫ్ పనితనం. కథకు తగ్గ లొకేషన్స్ ను షాట్ టు షాట్ బాగా నీట్ ప్రెజెంట్ చేశాడు. జె.బి అందించిన మ్యూజిక్ పర్వాలేదు. ఉద్దవ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
raja
-
Telugu
-
Cinema
-
sumanth ashwin
-
prabhakar
-
Chintamaneni Prabhakar
-
Parakala Prabhakar
-
Kathanam
-
Conductor
-
ravi anchor
-
Driver
-
kalyani
-
amrutha
-
marriage
-
deva
-
Surat
-
Accident
-
sumanth
-
Heroine
-
Pooja Hegde
-
Hero
-
Bahubali
-
jeeva
-
Director
-
Darsakudu
-
sekhar
-
Samsung
-
Apple
-
Huawei
-
Nokia
-
Sony
-
LG
-
HTC
-
Motorola
-
Redmi
-
Dell
-
HP
-
Asus
-
Acer
-
Hero Heroine
-
Naga Aswin