బాక్సాఫీస్ దగ్గర రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..!
ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న దర్బార్ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాలని వారి ఆకలి తీర్చాలని బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేయాలని 'దర్బార్' సినిమాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువగా ప్రతి సన్నివేశం పై రజనీకాంత్ చొరవ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా స్టైలిష్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నీ డైరెక్టర్ మురుగదాస్ చూపించినట్లు సమాచారం.
తాజాగా సినిమాకి సంబంధించిన సెకండ్ పోస్టర్ నీ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తమిళ పోస్టర్ ని చూసి రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో సినిమా పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఖచ్చితంగా సినిమా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇదే క్రమంలో మురుగదాస్ దర్శకత్వంలో మొట్టమొదటిసారి రజినీకాంత్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో కోలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్నట్లు సమాచారం. మరి దర్బార్ సినిమాతో ఈసారైనా రజనీకాంత్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. ఈ సినిమా కాబోయే సంక్రాంతికి విడుదల కానుంది.