పవన్ గడ్డం కటింగ్ వెనుక డాక్టర్ సలహా !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ఎంత ఆవేశంగా మాట్లాడుతాడో అతడి మాటలలో కొన్ని వాస్తవాలు కూడ ఉంటాయి. దీనికితోడు హేతువాదిగా కనిపించే పవన్ కు కొన్ని నమ్మకాలు సెంటిమెంట్లు కూడ చాల ఎక్కువ. ఇలాంటి పరిస్థుతులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా పోరాట యాత్ర చేస్తూ సుమారు ఒక సంవత్సరం కాలం పాటు పెంచుకున్న పవన్ గుబురు గడ్డం పై అనేక గాసిప్పులు వచ్చాయి.

ఒక జ్యోతిష్కుడు సలహాతో పవన్ గుబురు గడ్డం పెంచుకున్నాడు అంటూ కొందరు భావిస్తే మరికొందరు ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించడానికి పవన్ ఇలాటి గడ్డం లుక్ ను ఎంచుకున్నాడు అంటూ ఊహాగానాలు చేసారు. వాస్తవానికి ఎన్నికల ఓటమి తరువాత కూడ పవన్ తన గుబురు గడ్డంను అలాగే కొనసాగించాలి అని భావించాడట. 

అయితే పవన్ అందరి ఊహలకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ తన గుబురు గడ్డంను తీసివేసి తన గడ్డంను ట్రిమ్ చేసుకున్నాడు. దీనితో పవన్ తానా మహాసభల కోసం అమెరికా వెళుతున్న సందర్భంగా ఇలా తన లుక్ ను మార్చుకున్నాడని భావించారు అంతా. అయితే అసలు విషయం వేరు అని తెలుస్తోంది.తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ డాక్టర్ సలహాతో ఇలా తన గడ్డం లుక్ ను మార్చుకున్నాడని లీకులు వస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో పవన్ డాక్టర్ల సలహా పాటించి గడ్డం తీసేయాల్సి వచ్చిందట.

గతంలో పవన్ కు కంటిదగ్గర ఎలర్జీ వచ్చినప్పుడు హెయిర్ డైల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పవన్ కు అతడి వ్యక్తిగత వైద్యులు సూచించినట్లు టాక్. అయితే పవన్ పెంచుకున్న గుబురు గడ్డంకు తరుచు హెయిర్ డై వేయవలసిన పరిస్థితి రావడంతో అతడి గడ్డం కింద చర్మానికి ఎలర్జీ వచ్చిందని తెలుస్తోంది. దీనితో పవన్ కు అతడి స్కిన్ స్పెషలిస్ట్ ఇచ్చిన సలహాతో వెంటనే అతడి గుబురు గడ్డం తీయించు కున్నాడని లేకుంటే చర్మ సమస్యలు వస్తాయని వైద్యులు సలహా ఇవ్వడంతో  పవన్ తన గడ్డంను ట్రిమ్ చైమ్చుకోవడమే కాకుండా జుట్టు కూడా కత్తిరించుకుని తన గడ్డం బాబా అవతారం నుండి బయట పడ్డాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: