హీరో కాదు గౌతమ్ సెటిల్ అయ్యేది ఆ రంగంలోనే.. మహేశ్ బాబు మైండ్ బ్లోయింగ్ డెసీషన్..!?

Thota Jaya Madhuri
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు కూడా స్టార్ హీరోగానే అవ్వాలి అని అందరూ భావిస్తారు. చాలా మంది అభిమానులు, ఇంట్లోనే జనాలు కూడా ఇదే విధంగా ఆశపడతారు. కానీ భిన్నంగా ఆలోచించే వారు మాత్రమే తమ పిల్లల భవిష్యత్తును సరైన దిశలోకి తీసుకెళ్లగలరు. ఆ లిస్టులో టాప్ పొజిషన్‌లో ఉంటారు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకులు దేశానికి ఉపయోగపడే మంచి వృత్తిలో స్థిరపడితే బాగుంటుందని పరోక్షంగానే చెప్పుకొచ్చారు అని అభిమానులు హైలైట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా తన కొడుకు గౌతమ్‌ను సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా తీసుకురావడం కన్నా, అతడికి నచ్చిన పనిని చేయనిచ్చేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.



గౌతమ్ చదువుల్లో చాలా ప్రతిభావంతుడు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ హీరో, ఆయన తండ్రి కృష్ణ కూడా ఇండస్ట్రీని గజగజలాడించిన లెజెండరీ హీరో. కాబట్టి వారసత్వంగా గౌతమ్ కూడా సినిమాల్లోకి రావాలని అభిమానులు ఆశించారు. కానీ మహేష్ మాత్రం తన కొడుకు ఏం కావాలనుకుంటున్నాడో దానిపైనే దృష్టి పెట్టారు. గౌతమ్‌కు బిజినెస్ అంటే చాలా ఇష్టం. రకరకాల వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాడట. ఆ కారణంగానే మహేష్ బాబు కూడా గౌతమ్ ఇష్టాలను గౌరవించి, ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారు అని ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు పెద్ద స్టార్ హీరో కాబట్టి బలవంతంగా అయినా గౌతమ్‌ను హీరోగా మార్చే అవకాశం ఉంది. కానీ ఆయన అలా చేయకుండా కొడుకు ఇష్టానుసారం వదిలేయడం నిజంగా గొప్ప విషయం.



అంతేకాదు, సితార ఘట్టమనేని విషయంలో కూడా మహేష్ బాబు పూర్తిగా ఆమె ఇష్టానుసారం ముందుకు వెళ్లనిస్తున్నాడు. చాలా మంది స్టార్ హీరోల కుటుంబాలు తమ ఇంటి ఆడపిల్లలను ఇండస్ట్రీలోకి హీరోయిన్‌లుగా రానివ్వరు. ఇంటి పేరు చెడిపోతుంది అని భయం. కానీ మహేష్ మాత్రం తన కూతురు సితార హీరోయిన్‌గా రావడానికి కూడా ఓకే చెప్పారు. త్వరలోనే ఈ విషయం పై అఫిషియల్ గా ప్రకటించబోతునండు అంటూ కూడా టాక్ వినిపిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: