డివీవీ దానయ్య: స్టార్ హీరోలను సంక్రాతి బరిలో దించి దుమ్ముదులిపేసిన స్టార్ ప్రొడ్యూసర్.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో డీవీవీ దానయ్య ఒకరు.ఈ క్రమంలో నే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించింది. మూడు దశాబ్దాల కెరీర్‌లో, అతను 20కి పైగా చిత్రాలను నిర్మించాడు.ఈ నేపథ్యంలోనే దానయ్య 1992లో ఫాంటసీ కామెడీ చిత్రం జంబ లకిడి పంబ సహనిర్మాతగా తన కెరీర్‌ను ప్రారంభించాడు.దానయ్య నిర్మించిన సినిమాలు సముద్రం, మనసున్న మారాజు, శివమణి, దేశముదురు, వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే దుబాయ్ శీను, కృష్ణ , ఓయ్, జులాయి, నాయక్ , నిన్ను కోరి, భరత్ అనే నేను, వినయవిధేయరామ మరియు ఆర్ ఆర్ ఆర్.అలాగే తాజాగా దానయ్య నిర్మించిన చిత్రాలలో నాని నటించిన సరిపోదశనివారం కూడా ఒకటి.

ఇదిలావుండగా అతను నిర్మించిన చిత్రాలలో ముఖ్యంగా సంక్రాతికి విడుదలైన సినిమాల గురించి తెలుసుకుందాం.అగ్ర నిర్మాత డి.వి.వి దానయ్య సమర్పణలో ‘లక్ష్మీ నరసింహ విజువల్స్’ బ్యానర్ పై బి.కాశీ విశ్వనాథం నిర్మించిన చిత్రం ‘కృష్ణ’. ది పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి అనేది క్యాప్షన్. రవితేజ- వి.వి.వినాయక్ ల కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2008 వ సంవత్సరం జనవరి 12 న విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పోటీగా బాలకృష్ణ ‘ఒక్క మగాడు’ సినిమా ఉన్నప్పటికీ నిలదొక్కుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ‘కృష్ణ’.అలాగే రాంచరణ్ హీరోగా కాజల్ అగర్వాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమా నాయక్.2013 వ సంవత్సరంలో జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పోటీగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఉన్నప్పటికీ కూడా నాయక్ సినిమా ఘన విజయాన్ని సాధించింది.

ఇదిలావుండగా నాయక్ సినిమా రూ.44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఫుల్ రన్లో రూ.47.38 కోట్ల షేర్ ని రాబట్టింది. రూ.3.38 కోట్ల లాభాలతో ఈ మూవీ హిట్ లిస్ట్ లోకి చేరింది.ఈ క్రమంలోనే రాంచరణ్ హీరోగా, వివి బోయపాటి డైరెక్టర్ గా, డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా  11 జనవరి 2019న విడుదలై సంక్రాతి బరిలో ప్లాప్ టాక్ ను సొంతం చేసుంది. ఇదిలావుండగా దానయ్య నిర్మించిన సినిమాలలో సంక్రాంతి బరిలో మూడు సినిమాలు రాగ అందులోస్టార్ హీరోలు రవితేజ కృష్ణ, రాంచరణ్ నాయక్ మాత్రమే హిట్ టాక్ ను సొంతచేసుకొని సంక్రాంతి బరిలో దుమ్ముదులిపి దానయ్య ను స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో నిలబెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: