తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఎన్నో పౌరాణిక సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి మాస్ హీరో గా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ 1956 వ సంవత్సరం ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ ఏడు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. మరి ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
1956 వ సంవత్సరం సీనియర్ ఎన్టీఆర్ మొదటగా తెనాలి రామకృష్ణ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ మంచి విజయాన్ని అందుతుంది.
ఈ సంవత్సరం ఎన్టీఆర్ "చింతామణి" అనే సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేస్తుంది.
ఈ సంవత్సరం మూడవ ప్రయత్నం గా సీనియర్ ఎన్టీఆర్ "జయం మనదే" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ సంవత్సరం నాలుగవ సినిమాగా సీనియర్ ఎన్టీఆర్ "సొంత ఊరు" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
సీనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఐదవ సినిమాగా ఉమా సుందరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ సంవత్సరం చిరంజీవులు అనే సినిమాతో ఆరవ సారి ప్రేక్షకులను పలకరించిన సీనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఈ సంవత్సరం ఏడవ సినిమాగా సీనియర్ ఎన్టీఆర్ శ్రీ గౌరీ మహత్యం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇలా సీనియర్ ఎన్టీఆర్ 1956 వ సంవత్సరం ఏడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి ఏడు మూవీలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు.