విజయ్ నో.. చరణ్ ఎస్.. గేమ్ ఛేంజర్ సినిమా ట్విస్ట్ తెలుసా...!
ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. గేమ్ ఛేంజర్ కథ ముందుగా శంకర్ తమిళ హీరో .. కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ తో చేయాలని అనుకున్నాడట.. కానీ కుదరలేదు. ఈ కాంబినేషన్లో త్రీ ఇడియట్స్ సినిమాకు రీమేక్‌గా స్నేహితుడు వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. స్ట్రెయిట్ సబ్జెక్టు ఏదైనా చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో విజయ అభిమానులు కూడా తెగ ఫీలయ్యాయ్యారు. ఆ టైంలోనే కార్తీక్ సుబ్బరాజు ఒక కథ రాసుకొని శంకర్ కు వినిపించడం .. అది విజయ్ ఓకే చేయటం జరిగిపోయాయి. స్టోరీ నచ్చిన కూడా విజయ్ గ్రీన్స్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. దీని స్థానంలోనే బీస్ట్ ఒప్పుకున్నాడు.
అలా చేయి మారి పోయి దిల్ రాజు ద్వారా శంకర్ రామ్ చరణ్ ని కలుసుకోవడం .. వెంటనే చరణ్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పటం చక చక జరిగిపోయాయి. ఒకవేళ విజయ కనక గేమ్ ఛేంజర్ చేసి ఉంటే తన రాజకీయ తెరంగ్రేటానికి ముందు చేయాల్సిన సరైన సినిమాగా నిలిచిపోయి ఉండేది. కానీ జరిగింది వేరు .. ఇక మూడేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం విజయ్ అంత టైం కేటాయించేవాడు కాదు. ఇదిలా ఉంటే అజిత్ విడామయూర్చి సినిమా వాయిదా పడటంతో ఆ ఆనందంతో విజయ్ అభిమానులు గేమ్ ఛేంజర్ సినిమాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.