రంగంలోకి డాకూ... బాల‌య్య సినిమా లెవ‌ల్ ఎలా ఉందంటే...!

RAMAKRISHNA S.S.
సంక్రాంతి సినిమాల ప్రచారం ఊపు అందుకుంటుంది. గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్  గేమ్ ఛేంజర్ పాటలు ఒక్కొక్కటి వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. మెగా అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఇప్పుడు డాకు మహారాజు ట్రైలర్ వస్తోంది. ఐదున ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. అటు డల్లాస్ లో ఇటు తెలుగు నట ఒకేసారి డాకు మహారాజ్‌ ట్రైలర్ విడుదల చేస్తారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబి చేస్తున్న సినిమా ఇది. అలాగే వరుస విజయాల తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు డాకూ నుంచి రిలీజ్ అయిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ బాగుంది. పాటలు పరవాలేదు. ఇక ఇప్పుడు సినిమాను మరో మెట్టు ఎక్కించే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. ట్రైలర్ పక్క మాస్ యాక్షన్ థిస్ గా సాగుతుందా ? లేదా ఎమోషన్ యాడ్ అవుతుందా అన్నది చూడాలి. యాక్షన్ విత్ ఎమోషన్ ఉంటే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. కానీ బాలయ్య అంటే డైలాగ్ పవర్ కూడా యాడ్ అవ్వాలి. బాబి ఈ సినిమాకు ఎలాంటి డైలాగులు అందించారు అన్నది చూడాలి. బాబి డెప్త్ ఉన్న డైలాగులు .. ఫన్ డైలాగులు బాగా రాస్తారు. ఎమోషన్ పవర్ఫుల్ డైలాగులు పడాలి బాలయ్య సినిమా అంటే..!

ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ థ‌మన్. మిగిలిన సినిమాలుకు.. బాలయ్య సినిమాలకు తమన్‌ ఇచ్చే ఆర్ఆర్ చాలా తేడా ఉంటుంది. ట్రైలర్లో కూడా ఆ తేడా కనిపించాల్సి ఉంటుంది. ట్రైలర్ 5 వ తేదీన... తర్వాత ఏడున హైదరాబాదులో ఈవెంట్ ఉంటుంది. 9న అనంతపురం ఈవెంట్ .. అక్కడితో డాకు మహారాజ్‌ సినిమా ప్రచారం ముగుస్తుంది. ఇక బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ - శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ - ఫార్చున్ సినిమా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తో పాటు .. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏపీ - తెలంగాణలో దాదాపు రు. 80 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన జర్నీ ప్రారంభించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: