పుష్ప 2... 5 చోట్ల ప్లాపే.. 2 చోట్ల హిట్.. ఒక్క ఏరియాలో సంచలనం..!
నార్త్ మార్కెట్లో ఈ సినిమా రు. 1000 కోట్లు దాటేసింది.. అన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది. కానీ సౌత్ లో మాత్రం ఫెయిల్ అయింది. అల్లు అర్జున్‌కు సెకండ్ ల్యాండ్‌గా చెప్పుకునే కేరళలోను ఇది డిజాస్టర్ అయింది. అంతేకాదు ఏపీ లోను ఈ సినిమా అన్ని ఏరియాలలోను దాదాపు లాస్ లోనే ఉంది. బయ్యర్లకి డబ్బులు రాలేదట. ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సీడెడ్‌లోనూ అదే పరిస్థితి.. అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. నైజాంలో మాత్రం సేఫ్ అయిందని అంటున్నారు. ఇక కర్ణాటకలో ఈ మూవీ బాగానే చేసింది. అడ్వాన్సుల్ ఇచ్చిన వారికి బ్రేక్ ఈవెన్ అయిందని చెబుతున్నారు.
తమిళనాడులో మాత్రం పెద్ద డిజాస్టర్ అక్కడ కూడా బయ్యర్లకు డబ్బులు రాలేదట. ఇలా నాలుగు ఏరియాలో ఈ సినిమాకి కొన్న బయ్యర్లకి లాసులోనే ఉంది. దీంతోపాటు నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ కొన్న వారికి ఇంకా డబ్బులు రాలేదని చెబుతున్నారు. ఓవరాల్గా ఓవర్సీస్ లో హిట్ అయినా.. నార్త్ అమెరికాలో మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక్క హిందీలో అది కూడా బీహార్ - చత్తీస్‌ఘడ్ - జార్ఖండ్ - ఉత్తరప్రదేశ్ - మధ్యప్రదేశ్ - మహారాష్ట్ర - పశ్చిమబెంగాల్ లాంటి హిందీ బెల్ట్ లో మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చడంతో అక్కడ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. నార్త్ ఇండియాలో అడగకపోతే పుష్ప 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ జాబితాలో చేరిపోయేది.