ఇక రోహిత్ సెలెక్టర్ల ప్లాన్ లో ఉండడు.. మాజీ సంచలన వ్యాఖ్యలు?

praveen
భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా 5వ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యం కాకపోవడం అనేది ఎంత చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. దానికి కారణం అందరికీ తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ అనంతరం అతని బ్యాట్ నుంచి కనీస పరుగులు కూడా రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకంటే, అతని కెప్టెన్సీలో జట్టు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోవడం అనేది కూడా పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు అతగాడు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ జట్టు నుంచి తప్పుకోవడానికి ఇదే కారణం అని సుస్పష్టం అవుతోంది.
ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌ ముగింపు దశకు చేరినట్టు కనబడుతోంది. గత కొంత కాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్‌.. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టుకు దూరమైన నేపథ్యంలో ‘విశ్రాంతి’ పేరుతో రోహితే బెంచ్‌పై కూర్చున్నాడని టాస్‌ సమయంలో బుమ్రా తెలపడం గమనార్హం. అదే సమయంలో ఇప్పటికీ తమ కెప్టెన్‌ అతడేనని వ్యాఖ్యానించాడు. అయితే విశ్రాంతి పేరుతో బెంచ్‌కే పరిమితమైన రోహిత్‌ టెస్టు కెరీర్‌ ఇక ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు గుసగుసలు ఆడుకుంటున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం కొసమెరుపు.
అవును, ఇకపై భారత సెలక్టర్ల భవిష్యత్‌ ప్రణాళికల్లో రోహిత్‌ శర్మ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆయన మాట్లాడుతూ... "నాకు తెలిసినంతవరకూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌ ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ సిరీస్‌తో స్టార్ట్ అవుతుంది. సిడ్నీ తర్వాత భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు అనేవి లేవు. ఒకవేళ టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే సెలక్షన్ కమిటీ రోహిత్‌ శర్మ, ఇతర ఆటగాళ్ల విషయంలో ఆలోచించకతప్పదు. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్‌ ఫైనల్‌కు అందుబాటులో ఉంటారా? అని సెలక్టర్లు ఆటగాళ్లను అడుగుతారు. వచ్చే రెండేళ్ల భారత్‌ బాగా రాణించాలంటే సెలక్టర్ల ఆలోచన ధోరణి అలానే ఉండాలి మరి. రోహిత్ వయసు దాదాపు ఇప్పుడు 38 కాబట్టి.. సెలక్టర్ల ప్రణాళికల్లో అతను ఉండకపోవచ్చనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్‌ నాటికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి!" అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ వ్యాఖ్యలు ఇపుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: