బిగ్ బాస్8: విజేత ఎవరు.. ప్రైజ్ మనీ ఎంతంటే..?

Divya
బిగ్ బాస్ 8 వ సీజన్ కి సంబంధించి ఎట్టకేలకు ఉత్కంఠకు నిన్నటి రోజున తెరపడింది.. ఎన్నో ట్విస్టులతో సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైన ఈ బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ నిన్నటితో ముగిసింది. సుమారుగా 105 రోజులు పాటు సాగిన ఈ సీజన్ విజేత ఎవరనే విషయం కూడా తేలిపోయింది.. కన్నడ నటుడుగా పేరు పొందిన నిఖిల్ బిగ్బాస్ 8 విన్నర్ గా నిలిచారు. రన్నర్గా గౌతమ్ మాత్రం నిలిచారు.. బిగ్బాస్ 8 వ సీజన్లో మొత్తం మీద 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. చివరికి గౌతమ్, ప్రేరణ, నిఖిల్, నబిల్, అవినాష్ వంటి వారు మాత్రమే నిలిచారు.

ఫైనల్ గా నిఖిల్ వర్సెస్ గౌతమ్ మధ్య విన్నింగ్ రేస్ మొదలయ్యింది. ఇందులో నిఖిల్ విజేతగా నిలవగా గౌతమ్ రన్నర్ గా నిలిచారు.. అయితే ఇందులో విన్నర్ అయిన నిఖిల్ కు రూ .55 లక్షలు ప్రైజ్ మనీతో పాటుగా ఒక మారుతి సుజుకి కారుని కూడా ఇచ్చినట్లు సమాచారం. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటుడు నికే సుపరిచితమయ్యాడు. ఇప్పుడు మరొకసారి బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాలని చెప్పవచ్చు. ఇక రన్నర్గా గెలిచిన గౌతమ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కు మాత్రం చాలా గట్టి పోటీ ఇచ్చారు గౌతం.

అయితే ఎలిమినేట్ అవుతాడు అనుకున్న ప్రతిసారి గౌతమ్ టైటిల్ రేసులో నిలవడంతో ఒక్కసారిగా నిఖిల్ కి చెమటలు పడ్డాయి. దీంతో చివరి వరకు గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ 8 వ సీజన్ విన్నర్ ఎవరో అని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు. ఎప్పుడైతే వైల్డ్ కార్డు ద్వారా గౌతమ్ ఎంట్రీ ఇచ్చారా అప్పుడే నిఖిల్ కి గట్టి పోటీ ఎదురయ్యింది.. చివరి వరకు టఫ్ ఫైట్లో గౌతమ్ తక్కువ ఓటింగ్ తేడాతో మాత్రమే రన్నర్ గా నిలిచారు. మొత్తానికి బిగ్ బాస్ 8 విన్నర్ మాత్రం నిఖిల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: