"పుష్ప2కి అమ్మ మొగుడు లాంటి సినిమా అది" ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని బయటపెట్టిన రష్మిక మందన్నా..!
అసలు రష్మిక లేకపోతే ఇంత సినిమాని మేము తెరకెక్కించి ఉండే వాళ్ళమే కాదు అంటూ ఓపెన్ గా చెప్పడం అందరికీ షాకింగ్ గా అనిపించింది . తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రిక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా పుష్ప 2 సినిమా కోసం అందరూ ఎంతలా కష్టపడ్డారు అన్న విషయాన్ని బయటపెట్టింది . అంతేకాదు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా బయటపెట్టింది . మరీ ముఖ్యంగా రష్మిక నెక్స్ట్ ప్రాజెక్ట్ లిస్టులో సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా అంటే మాత్రం "అనిమల్ పార్క్" .
సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాకి సిక్వెల్ గానే ఈ అనిమల్ పార్క్ రాబోతుంది . ఈ సినిమాతో రష్మిక మరొక బిగ్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందని చెప్పడంలో సందేహమే లేదు . రీసెంట్ ఇంటర్వ్యూలో అనిమల్ పార్క్ సినిమా విషయం ప్రస్తావించగా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చాలా వైల్డ్ గా ఉండబోతుంది ఈ సినిమా అని షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? అంటూ వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు చాలామంది పుష్ప2 సినిమా రికార్డులను ఏ డైరెక్టర్ ..ఏ హీరో బ్రేక్ చేయలేడు అంటూ చాలా చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే కచ్చితంగా అది సందీప్ రెడ్డివంగాకు మాత్రమే సాధ్యమవుతుంది ..అనిమల్ పార్క్ తో వెయ్యి కోట్లను అవలీలగా దాటేస్తాడు అంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో కొంతమంది పుష్ప2కి అమ్మ మొగుడు రేంజ్ లో ఉండబోతుంది అనిమల్ పార్క్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు..!