గోదావరిలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ... టాప్ వికెట్లు టపాటపా..?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనంతరం ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి తరచూ పెద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏలూరు మేయర్ పెదబాబు దంపతులు ... ఆ తర్వాత పెద్ద సంఖ్యలో వైసిపి కార్పొరేటర్లు టిడిపి గూటికి చేరిపోయారు. కీలక నాయకులైన బద్దాన్ని శ్రీనివాస్ .. మంచెం మై బాబు సైతం వైసీపీకి టాటా చెప్పేశారు. వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని రాజీనామాతో జిల్లాలో పార్టీకి పెద్ద దెబ్బ పడింది. ఇటీవల కొల్లేరు లో ముఖ్య నేతగా ఉన్న జయ మంగళ వెంకట రమణ ఏకంగా ఎమ్మెల్సీ పదవికి .. పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడి వెళ్లడంతో పశ్చిమ వైసిపి లోను ముసలం మొదలైంది. మరి కొంతమందిది అదే బాట అని తెలుస్తోంది. ఓవైపు జగన్ కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు పిలిపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో నడిపే నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉండటం వైసీపీకి మింగుడు పడని అంశంగా మిగిలింది.