ప్రశాంత్ వర్మ చెంప చెల్లుమనిపించిన బాలయ్య.?

Pandrala Sravanthi
ఏంటి ప్రశాంత్ వర్మ బాలకృష్ణ చేతిలో చెంప దెబ్బలు తిన్నారా.. ఎందుకు బాలకృష్ణ చేయి చేసుకున్నారు..సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న హీరోలలో బాలకృష్ణ ఒకరు.. అలాంటి ఈయన తన కొడుకు మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని గత నాలుగు ఐదు సంవత్సరాలు నుండి ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన జాతకం బాగాలేదనో లేక ఇంకా ఇండస్ట్రీకి వచ్చేంత మెచ్యూరిటీ రాలేదనో లేక సరైన కథలు దొరకలేదో తెలియదు కానీ ఇన్ని రోజులు ఆయన్ని సినిమాల్లోకి రాకుండా అడ్డుకున్నారు.కానీ వచ్చే ఏడాది మాత్రం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతోంది. అలాగే ఇప్పటికే కథ కూడా ఫైనలైజ్ అయింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ని కూడా తన కొడుకు మొదటి సినిమాకి డైరెక్టర్ నీ తీసుకున్నారు. 

అయితే ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఈ డైరెక్టర్ మీద నమ్మకంతో బాలకృష్ణ తన కొడుకు మొదటి సినిమా బాధ్యతను  ప్రశాంత్ వర్మకి అప్పగించారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణకి కూడా ఒక కీలకపాత్ర ఉంటుంది.అయితే సడన్ గా ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ సినిమాకి కథ నేను అందిస్తాను కానీ దర్శకత్వం మాత్రం నా అసిస్టెంట్ చేస్తాడు అని బాలకృష్ణకి చెప్పడంతో ఫైర్ అయిన బాలకృష్ణ వద్దని చెప్పారట.

అంతేకాదు గత కొద్ది రోజులుగా ఎన్నో రూమర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చావు కబురు చల్లగా చెప్పినట్టు నేను ఈ సినిమాకి దర్శకత్వం వహించను అని ప్రశాంత్ వర్మ చెప్పడంతో కోపం తెచ్చుకున్న బాలకృష్ణ ప్రశాంత్ వర్మ చెంప చెల్లుమనిపించినట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి టాలీవుడ్ సినీ వర్గంలో వినిపించే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ బాలకృష్ణకి కోపం వస్తే ఎదుట ఎవరున్నారు అని కూడా చూడకుండా చేయి చేసుకుంటారు అనే టాక్ ఉంది. దాంతో ప్రశాంత్ వర్మని నిజంగానే కొట్టారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: