వంగవీటికి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇదే...!
దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా తనయుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా రాజకీయంగా ఎందుకు ? సక్సెస్ కాలేకపోయారు. కాంగ్రెస్ నుంచి అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన రాధా ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అనంతరం వైసిపి మీదగా టిడిపి గూటికి చేరిన వంగవీటి రాధాకు రాజయోగం అయితే దక్కటం లేదు. ఎప్పుడో 2004లో గెలిచిన ఎమ్మెల్యే పదవి తప్ప రెండు దశాబ్దాల కాలంలో మళ్ళీ ఆయన చట్టసభలోకి అడుగుపెట్టలేదు. అధికారంలోకి వచ్చే పార్టీ నుంచి ఆయన చివరి నిమిషంలో తప్పుకోవటమే ఆయన కెరీర్ కు మైనస్ అవుతూ వస్తోంది. 2019లో వైసీపీ గెలుస్తుంది అనుకున్నప్పుడు రాధా టీడీపీలోకి వెళ్లారు. 2024 కి ముందు కూడా అలాంటి ఊగిస లాటే ఆయన వైపు కనిపించింది. అయితే నారా లోకేష్ ఇచ్చిన భరోసాతో టీడీపీకే ప్రచారం చేసి పెట్టారు. టిడిపి గెలిచి ఆరు నెలలు అవుతున్న వంగవీటి కి పదవి ఏది అన్న ఆవేదన ఆయన అభిమానుల్లో కనిపిస్తోంది.
వంగవీటిని ఎమ్మెల్సీగా తీసుకునే మంత్రిని చేస్తారు అన్న మాట వినిపించింది. అందుకోసమే క్యాబినెట్లో ఒక ఖాళీ ఉంచారు అని అందరూ అనుకున్న ఇప్పుడు ఆ ఖాళీ నాగబాబుతో భర్తీ చేస్తున్నారు. దీంతో వంగవీటి అనుచరులలో ఆందోళన మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవి ఫిక్స్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు ... వంగవీటి రాధాను స్వయంగా పిలిపించుకొని మాట్లాడారని చెబుతున్నారు. వచ్చే మార్చి నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒకదానిని కచ్చితంగా ఇచ్చి శాసనమండలికి డామినేట్ చేస్తానని చంద్రబాబు రాధాకు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న కాలమంతా ఎమ్మెల్సీ పదవులు జాతరే అన్నది తెలిసిందే. వచ్చే మార్చిలో ఐదు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ పదవి పదవులు అన్ని టీడీపీకే దక్కనున్నాయి. ఇందులోనే రాధాకు ఒక పదవి దక్కనుంది.