పాన్ ఇండియా మూవీతో లోకల్ రికార్డును క్రాస్ చేయలేకపోయిన పుష్ప.. ఇప్పటికీ అలా వైకుంఠపురంలో టాప్..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మొదటి నాలుగు రోజులు ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. కానీ ఐదవ రోజు నుండి ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గాయి. అయినా కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజులు బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఇక ఈ సినిమా విడుదల అయిన ఏడవ రోజు మాత్రం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో చాలా కింది స్థాయికి వెళ్లిపోయింది. విడుదల అయిన ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను లను వసూలు చేసిన సినిమాలలో అల్లు అర్జున్ హీరో గా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 8.43 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత బాహుబలి 2 మూవీ 8.30 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , సైరా నరసింహారెడ్డి సినిమా 7.90 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానం లోనూ , సరిలేరు నీకెవ్వరు సినిమా 7.64 కలెక్షన్లతో నాలుగవ స్థానం లోనూ , ఆర్ ఆర్ ఆర్ మూవీ 7.48 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ , కల్కి 2898 AD సినిమా 6.04 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలవగా , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 5.85 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలో ఉంది.

ఇలా పుష్ప పార్ట్ 2 మూవీ కంటే కూడా విడుదల అయిన ఏడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లులను వసూలు చేసిన సినిమాలు లిస్టులో ముందు స్థానాల్లో ఆరు మూవీలు ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా మొదటి స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: