రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు చిరంజీవి... ఎవ‌రు చేస్తున్నారు... ఎలా ..?

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవిని పంపుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్రపతి కోటాలో 4 ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఈ కోటా లో రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ కోటాలోనే ఎంపీ అయ్యారు. ఆయన బిజెపి సభ్యత్వం తీసుకోలేదు. ఈ కోటా లో ఎంపికయ్య వారు అనధికారికంగా బిజెపికి మద్దతుగా ఉంటారు .. కానీ అధికారికంగా ఏ పార్టీ సభ్యులు కారు .. చిరంజీవి రాజకీయాలనుంచి విరామం తీసుకున్నారు. తాను ఏ పార్టీలో చేరేది లేదని చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు బిజెపి రాజ్యసభకు పంపాలంటే చిరంజీవి ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. బిజెపి లో కూడా చేరాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో ఆయన పద్మ విభూషన్ కూడా పొందరు కాబట్టి ఆయ‌న ఎంపీ గా నామినిట్ అవ్వటానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి.

మోడీకి చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం కూడా ఉంది. అందుకే చిరంజీవి ని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జ‌రుగుతోంది. నాగబాబు ఎలాగైనా రాజ్యసభకు వెళ్లాలని కోరుకున్నారు. అయితే ఆయనను రాజ్యసభకు పంపలేదు. ఈ క్రమంలోనే ఆయనకు ఏపీ క్యాబినెట్లో అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరో ఏడాది తర్వాత అయ్యే ఖాళీలతో అయినా చిరంజీవిని రాజ్యసభకు పంపవచ్చు. ఇక ఇప్పుడు నాగ‌బాబు రాజ్య‌స‌భ‌కు వెళ్లి ..ఆ వెంట‌నే చిరు కూడా రాజ్య‌స‌భ కు వెళితే బాగోదు అన్న ఉద్దేశం తోనే నాగ‌బాబును రాష్ట్రంలో నే ఉంచాల‌నే ఆయ‌న్ను ఇక్క‌డ కేబినెట్లోకి తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా చిరు ను రాష్ట్ర ప‌తి కోటాలో రాజ్య‌స‌భ కు నామినేట్ చేస్తే చిరు కు మ‌ళ్లీ మంచి పేమ్ వ‌చ్చిన‌ట్టే .. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: