మంచు ఫ్యామిలీలో జరిగే వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ప్రకంపణలు సృష్టిస్తోంది. ఒక పెద్ద మనిషి స్థానంలో ఉండే మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి గొడవలు జరగడం ఆయన వ్యక్తిత్వానికి సిగ్గు చేటు అనేలా ఉంది.ఇండస్ట్రీ మొత్తం మోహన్ బాబుని ఎంతో గౌరవించేది.అలాంటి మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఇండస్ట్రీలో రచ్చరచ్చ చేస్తున్నాయి. దీంతో మోహన్ బాబు పరువు మొత్తం పోతుంది.ఇప్పటికే మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లడం మీడియా వాళ్లపై మోహన్ బాబు దాడి చేయడం ఇలా ఎన్నో జరిగాయి.అయితే ఇలాంటివేళ తాజాగా మోహన్ బాబుని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్దమనిషి స్థానంలో ఉన్న మోహన్ బాబు కొడుకులకు నచ్చజెప్పకుండా సై అంటే సై అన్నట్టు వారి మీదకు పోవడం..
సమాచారం కోసం వచ్చిన మీడియాపై దాడి చేయడం వంటివి మనం చూసాం. అయితే మీడియాపై దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. మీడియా వాళ్ళనే కొట్టారంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మోహన్ బాబుకి బాగా అహంకారం,పొగరు ఉంటుంది అని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈయన ఏదైనా ఈవెంట్ కోసం వచ్చిన సమయంలో స్టేజ్ ఎక్కారంటే చాలు మేం గొప్ప..మేమంత.. మేమింత అంటూ మాట్లాడుతూనే ఉంటారు.అలా చాలాసార్లు ఈయన మాట్లాడిన మాటలు కొంతమందికి హర్టింగ్ గా కూడా అనిపించాయి.
అయితే అలాంటి మోహన్ బాబు నిజస్వరూపం ఎలాంటిదో నిన్నటితో బయటపడిందని, సమాచారం కోసం వచ్చిన వారిపై చేయి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని, చాలామంది మోహన్ బాబు వ్యక్తిత్వాన్ని విమర్శిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి ఒక కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం మంచిదేనా..తక్షణమే మంచు విష్ణుని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుండి అలాగే మోహన్ బాబుని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలి అంటూ పలువురు నినాదాలు చేస్తున్నారు. మరి విష్ణుని మా అధ్యక్షుడి పదవి నుండి తొలగిస్తారా.. మోహన్ బాబుని ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందా అనేది చేయాల్సి ఉంది