Pushpa 2: రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ ?
దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు విపరీతంగా కలెక్షన్లు రావడం జరిగింది. రెండు రోజుల్లోనే 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది పుష్ప 2. అయితే సినిమా భారీ హిట్ కొట్టడంతో... తాజాగా సక్సెస్ మీట్ హైదరాబాదులో నిర్వహించింది చిత్ర బృందం. ఈ సక్సెస్ మీట్ కు అల్లు అర్జున్..రావడం జరిగింది. ఈ సందర్భంగా...పుష్ప సినిమా సక్సెస్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్.
పుష్ప సక్సెస్ కావడం వెనుక అందరి కృషి ఉందని కొనియాడారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల ధరలు పెంచిన సందర్భంగా.. రేవంత్ రెడ్డి ని పొగిడే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్. అయితే.. మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు అల్లు అర్జున్. తెలంగాణ ముఖ్యమంత్రి... అంటూ మాట్లాడిన అల్లు అర్జున్...కాసేపు తడబడి..పోయాడు. మధ్యలో వాటర్ కావాలంటూ తన స్పీచ్ ఆపేశాడు.
ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... గులాబీ పార్టీ సోషల్ మీడియా తెగ వాడుకుంటుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది గులాబీ పార్టీ. ఇప్పటికి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అని... అల్లు అర్జున్ భావించాడని... అందుకే రేవంత్ రెడ్డి పేరు అతనికి గుర్తు రాలేదని కూడా కొంతమంది... అంటున్నారు గులాబీ నేతలు.