ఒక్కటైనా నాగచైతన్య - శోభిత.. పెళ్లి ఫోటో వైరల్ ?

Veldandi Saikiran
అక్కినేని ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నాగ చైతన్య, శోభిత వివాహం జరిగింది. చాలా కాలం నుంచి నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉండి సీక్రెట్ రిలేషన్ కొనసాగించారు. ఇక కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కొన్నేళ్ల నుంచి చాలా సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన ఈ జంట వివాహం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కినేని ఇంట పండగ వాతావరణం నెలకొంది.
నాగచైతన్య శోభిత దూళిపాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో చైతు, శోభిత వివాహం జరిగింది. అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ముందు ఈ జంట వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత దూళిపాళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నూతన వధూవరులు రేపు లేదా ఎల్లుండి తిరుమల శ్రీ వారిని దర్శనం చేసుకుని అనంతరం శ్రీశైలం వెళ్లి దేవుడిని దర్శించుకోనున్నారట.
ప్రస్తుతం నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చైతు, శోభిత వివాహానికి కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు, ప్రముఖులు అందరూ వచ్చి సందడి చేశారు. ఈ ఫోటోలలో శోభిత చాలా సాంప్రదాయంగా చీర కట్టులో ముస్తాబు అయింది. ఒంటినిండా బంగారు నగలతో అలంకరించుకుంది.

ఈ ఫోటోల లో శోభిత కుందనపు బొమ్మల చాలా అందంగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరి శోభితపై పడింది. నాగ చైతన్య కూడా చాలా సాంప్రదాయంగా రెడీ అయ్యాడు. చైతు, శోభిత వివాహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఇందులో నాగార్జున చాలా సంతోషంగా ఉన్నారు. తన కుమారుడిని చూస్తూ అలానే ఉండిపోయాడు. ఇక ఈ ఫోటోలు చూసిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా నూతన వధూవరులకు విషెస్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: