పుష్ప -2 ఫస్ట్ రివ్యూ: పుష్పరాజ్ నట విశ్వరూపంతో బొమ్మ బ్లాక్ బస్టర్.. ఫ్యాన్స్ ఖుషీ..!

Divya
పుష్ప-2 సినిమా మరికొన్ని గంటలలో థియేటర్లోకి రాబోతోంది అంటే ఈరోజు రాత్రి నుంచి పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శన జరుగుతోంది.. యూఎస్ఏ లో కంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో షోలు పడబోతున్నాయి..2021 లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్ గానే పుష్ప-2 సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఏకంగా మూడేళ్లు ఈ సినిమా సీక్వెల్ కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది.. అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఈ సినిమా కోసం ఎదురు చూశారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా పుష్ప-2 ఉన్నది.

తాజాగా నిర్మాతలు ప్రీమియర్స్ షో ఏర్పాటు చేసుకొని మరి సినిమాను చూసినట్లుగా సమాచారం.. ఫస్ట్ కాపీ నేనే చూశానని మగధీర సినిమా చూసినాక ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాగే పుష్ప-2 సినిమా చూసిన తర్వాత ఫీలింగ్ కలిగిందని అల్లు అరవింద్ తెలియజేశారు. దీంతో పుష్ప చిత్ర బృందం నుంచి టాక్ బయటికి రావడంతో పుష్ప-2 ఫస్ట్ రివ్యూ వైరల్ గా మారుతున్నది.. పుష్ప మొదటి భాగం రష్మిక, అల్లు అర్జున్ పెళ్లితో మొదటి భాగం ముగిస్తుంది..అక్కడినుంచి కథ మొదలవుతుంది.. శ్రీవల్లిని వివాహం చేసుకున్న పుష్పరాజ్ అంచలంచలుగా ఎలా ఎదుగుతారు.. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ మాఫియా అని తన కనుసన్నుల్లో ఎలా నడిపించే కింగ్ గా మారుతారు.. పుష్పరాజ్ రేంజ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కి ఎలా విస్తరించింది.. ఈ విషయం షేకావత్ విన్న తర్వాత పగతో ఎలా రగిలిపోతారు పుష్పరాజును కట్టడి చేయడానికి ఎలాంటి పన్నాగాలు పడతారు.. పుష్పరాజు జీవితం స్మగ్లర్ గానే ముగుస్తుందా లేదా అనే విషయం తెలియాలి అంటే సిల్వర్ స్క్రీన్ పైన చూడాల్సిందే.

అల్లు అర్జున్ తన నటనతో మరొకసారి హైపెక్కించారని.. అల్లు అర్జున్ ఎంట్రీ షాట్ కు సినిమా హైలెట్ గా ఉంటుందని నిజంగా ప్రతి సన్నివేశం కూడా అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తుందని ప్రతి పది నిమిషాలకు ఒకసారి క్లైమాక్స్ ని తలపించే ట్విస్టులతో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు థియేటర్లలు దద్దరిల్లడం ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మరొకసారి తన రాంపేజ్ తో ఉంటుందట. అల్లు అర్జున్ డాన్సులతో కూడా ఎవరు సాటిరారు అనేట్టుగా వేశారని.. స్పెషల్ సాంగ్ లో అదరగొట్టేసాడని సమాచారం.. రష్మిక కెరియర్ లోని బెస్ట్ చిత్రంగా బెస్ట్ క్యారెక్టర్ శ్రీ వల్లిగా ఉంటుందనీ టాక్ వినిపిస్తోంది. అలాగే అనసూయ రోల్ లుక్స్ కి కూడా ఇందులో మరొకసారి విజిల్స్ పడేలా చేస్తాయని అనసూయ కెరియర్ల ఒక మైలురాయిగా ఈ సినిమాలోని పాత్ర ఉంటుందని టాక్. ఇందులో అనసూయకు కాస్త ఎక్కువగానే స్క్రీన్ స్పేస్ దక్కినట్లు సమాచారం.. సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ అని.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.. మొత్తానికి పుష్ప-2 తో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు ఫ్యాన్స్.. అభిమానులు కూడా ఈ విషయం తెలియగానే ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: