జానీ మాస్టర్ కు ఆ మూవీ ఆఫర్ దక్కిందా.. ఈ కొరియోగ్రాఫర్ కెరీర్ పుంజుకుంటుందా?

Reddy P Rajasekhar
ఈ ఏడాది ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. జానీ మాస్టర్ కు బెయిల్ విషయంలో ఎన్నో చర్చలు జరగగా ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. జానీ మాస్టర్ రాబోయే రోజుల్లో ఈ కేసు నుంచి పూర్తిస్థాయిలో బయటపడతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ మూవీకి బాలీవుడ్ మూవీ ఆఫర్ వచ్చిందని భోగట్టా.
 
వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాపై ఒకింత భారీ అంచనాలు నెలకొనగా తెరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బేబీ జాన్ ఆఫర్ తో జానీ మాస్టర్ కెరీర్ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది.
 
జానీ మాస్టర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. తర్వాత ప్రాజెక్ట్ లతో జానీ మాస్టర్ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జానీ మాస్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జానీ మాస్టర్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ముందుకెళ్లాల్సి ఉంది.
 
జానీ మాస్టర్ కు టాలీవుడ్ స్టార్స్ సైతం ఆఫర్లు ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ మంచి వ్యక్తి అని ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు పని చేసే ఛాన్స్ దక్కితే జానీ మాస్టర్ కు సులువుగానే పూర్వ వైభవం వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: