ఆ ఒక్క మాటతో రెండు చేతుల జేబులో పెట్టుకుని వెళ్లిపోవచ్చు బ్రదర్..!

Thota Jaya Madhuri
అల్లు అర్జున్ ..తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన మాట్లాడిన కొన్ని కొన్ని మాటలు మాత్రం మిగతా స్టార్స్ కి బాగా హర్టింగ్గా అనిపిస్తూ వస్తున్నాయి . మొన్నటికి మొన్న ముంబైలో జరిగిన ఈవెంట్లో తన కెరీర్ కు కర్త - కర్మ - క్రియ అంతా కూడా సుకుమార్ అంటూ ఇన్నేళ్లు తన పడ్డ కష్టానికి ఫలితం మొత్తం కూడా సుకుమార్ ఖాతాలో వేసేసాడు . అఫ్ కోర్స్ బన్నీ మాటల్లో వాస్తవం ఉంది . కాదు అనడం లేదు బన్నీ కెరీర్ కు హిట్స్ అందించింది సుకుమార్ నే.  ఆర్య వన్ అదేవిధంగా పుష్ప సినిమాలు ఆయన కెరియర్ను మార్చేశాయి.


అయితే సుకుమార్ ఒక్కడితోనే బన్నీ కెరియర్ హైలెట్ అయింది అని మాత్రం చెప్పడం కష్టం. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పాత్ర కూడా చాలా కీలకం.  బన్నీ కెరియర్ లో సుకుమార్ తో ఎన్ని హిట్స్ అందుకున్నాడు అనే విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో కూడా హిట్స్ అందుకున్నాడు . మరీ ముఖ్యంగా జులాయి సినిమా గురించి మాట్లాడుకోవాలి . ఈ సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ వేరే లెవెల్ చాలా చాలా బాగుంటుంది.  అదే విధంగా సన్ ఆఫ్ సత్యమూర్తి . ఇది టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ .


అదే విధంగా అలా వైకుంఠపురం. ఈ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో మనకు తెలిసిందే . మరి అలాంటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరు ఎత్తకుండానే బన్నీ తన పుష్ప2 ప్రమోషన్స్ మొత్తం కంప్లీట్ చేసేయడం షాకింగ్ అనిపిస్తుంది.  దీనితో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అవుతున్నాడు . బన్నీ పుష్ప2 సినిమా హిట్ అవ్వచ్చు కాకపోవచ్చు . అయితే నువ్వు మాట్లాడిన విధానం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని నెగ్లెక్ట్ చేసిన పద్ధతి చూసి నీ స్పీచ్ విని రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోవాలనిపించింది.. అనే త్రివిక్రమ్ డైలాగ్ ను కాపీ కొట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు . ఆశ్చర్యం ఏంటంటే పుష్ప2 సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తోనే సినిమాకి కమిట్ అయ్యాడు బన్నీ.  మరి అలాంటి డైరెక్టర్ ని పుష్ప 2  ప్రమోషన్స్ కి పిలవకపోవడం పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించకపోవడం ఏంటి..?  అనేది అభిమానుల ప్రశ్న . దీనికి జవాబు ఏమిస్తారో బన్నీ చూద్దాం..!!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: