ఆ నలుగురు స్టార్ హీరోలు భార్యలతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న లింక్ ఇదే..!
ప్రధానంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుమలత గురించి చెప్పాలి .. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సుమలత శుభలేఖ , ఖైదీ , అగ్నిగుండం వంటి సినిమాల్లో కలిసి నటించింది .. ఇప్పటికీ సుమలత , చిరు మధ్య రిలేషన్ అలానే ఉంది . ఇక చిరంజీవి ఎప్పుడు కనిపించిన సుమలత అభిమానం చూపిస్తూనే ఉంటారు .. ఇక సుమలత కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు అంబరీష్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని అమలతో కూడా కలిసి నటించారు .. ఇక చిరంజీవి , అమలా కలిసి రాజా విక్రమార్క అనే సూపర్ హిట్ సినిమాలు నటించారు .. ఇక ఈ సినిమా 1990లో విడుదలైంది .. ఈ సినిమా వచ్చిన రెండు సంవత్సరాలకు అమల , నాగార్జునను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిలైంది . ఇక నాగార్జునతో పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరంగా ఉంది . సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది.
మరో స్టార్ హీరోయిన్ జ్యోతిక తో కూడా చిరంజీవితో ఠాగూర్ సినిమాలో కలిసి నటించింది .. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది . ఈ సినిమాలో చిరు - జ్యోతిక మధ్య కెమిస్ట్రీ ఎంతో బ్యూటిఫుల్ గా వర్క్ అవుట్ అయింది. 2003లో ఠాగూర్ చిత్రంలో నటించిన జ్యోతిక 2006లో సౌత్ స్టార్ హీరో సూర్యని పెళ్లి చేసుకొని ఇప్పటికీ జ్యోతిక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. ఇక అలాగే చిరంజీవితో నటించిన మరో స్టార్ హీరో భార్య నమ్రత .. గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. చిరంజీవి నమ్రతా కలిసి 2004లో వచ్చిన అంజి సినిమాలో నటించారు . ఇక ఈ సినిమా అనేక కారణాలవల్ల డిజాస్టర్ గా నిలిచింది. అలాగే మరో సీనియర్ హీరోయిన్ రాధిక , చిరంజీవి జంట కూడా ఎంతో పాపులర్ .. రాధిక కూడా కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. చిరంజీవి హీరోల భార్యలతో నటించిన సినిమాల్లో అంజి సినిమా ఒక్కటే బాడ్ ఎక్స్పీరియన్స్ .. ఇక నమ్రతకు కూడా అదే చివర సినిమా ఆ తర్వాత మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది..