పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత ?
అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. భారీ కటౌట్స్, పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టించారు. కాగా బన్నీ పోస్టర్లు చించి వేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఈ ఘటన అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పిఠాపురంలో సినిమా థియేటర్ల వద్ద పుష్ప 2 సినిమా పోస్టర్లు అంటించారు. ఇక కొంతమంది వ్యక్తులు ఆ పోస్టులను చించివేశారు. ఈ పని చేసిన వారు ఎవరో తెలుసుకునే పనిలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారట. తమ అభిమాన హీరో సినిమా పోస్టర్లు చించడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా ఉన్నారట.
ఎట్టి పరిస్థితు ల్లో ఈ పని చేసిన వారు ఎవరో తెలుసుకోవాలని చూస్తున్నారట. కాగా బన్నీ ఫ్యాన్స్ ఈ పని చేసిన వారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని మండిపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి మెగా & అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ గొడవల కారణంగానే పుష్ప సినిమా పోస్టర్లు చింపేశారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.