సావిత్రి చనిపోతుందని ఆయనకు ముందే తెలుసా..? అందుకే ఆఖరి రోజుల్లో అలా చేశాడా..?
మహానటి అంటూ ఆమె బాగా అందరి చేత పిలిపించుకుంది . ఆ పాత్ర ఈ పాత్ర కాదు ఏ పాత్ర అయినా సరే అవలీలగా నటించేస్తుంది. మరీ ముఖ్యంగా డైరెక్టర్ చెప్పిన సీన్స్ ఒకే షాట్లో ఓకే చేయడం సావిత్రి స్పెషాలిటీ . అయితే సావిత్రి చాలా చాలా టాలెంటెడ్ . చాలా మొండి మనిషి కూడా . అందుకే జెమినీ గణేష్ ని పెళ్లి చేసుకోవద్దు అంటూ ఎంతమంది చెప్పినా కూడా మొండి పట్టుదలగా ఆయనను పెళ్లి చేసుకుని కెరీర్ నాశనం చేసుకుంది. మరి ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ , ఏఎన్నార్ లు కూడా సావిత్రిని జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకోవద్దు అంటూ సతవిధాల ట్రై చేశారు .
అయినా కూడా ఆమె మాట వినలేదు . అదే మూమెంట్లో ఎన్టీఆర్ సావిత్రి జాతకాన్ని కూడా ఆయన బాగా నమ్మే పండితుడు దగ్గర చూపించారట . ఆ పండితుడు కూడ సావిత్రి కచ్చితంగా జెమినీ గణేష్ ని పెళ్లి చేసుకుంటుంది అని .. ఆ తర్వాత ఆమె కెరియర్ బాగా డౌన్ అవుతుంది ..పడరాని పాట్లు పడుతుందని ..అతి చిన్న వయసులోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుంది అని చెప్పుకొచ్చారట . ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమెను పరోక్షకంగా ఆయనతో పెళ్లి వద్దు అంటూ ఎంత హెచ్చరించినా కూడా అసలు వినలేదట . దేవుడు రాసిన తలరాత ఎవరు తప్పించగలరు. అనుకున్న విధంగానే సావిత్రి చాలా చాలా ఇబ్బందులు పడి ఆఖరి రోజుల్లో నా అన్న వాళ్ళ దగ్గర లేకుండా అల్లాడిపోయింది . ఆమె మరణం అందరికీ ఒక గుణపాఠం..!!