జాతిరత్నం అనుదీప్ ని పక్కన పెట్టిన వెంకీ మామ.. కారణం అదేనా..?

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో చిన్న సినిమాలతో వచ్చి పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్స్ చాలామంది వున్నారు. అలాంటి వారిలో జాతిరత్నాలు సినిమాతో బాగా పాపులర్ అయిపోయిన డైరెక్టర్ అనుదీప్.అస్సలు విడుదల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర దర్శకుడు అనుదీప్‌ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.దీంతో కొన్ని రోజులు ఈ యంగ్‌ డైరెక్టర్‌ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుదీప్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమా చేయాలనే ప్లాన్‌ ఉన్నానని తెలిపాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని అనుదీప్‌ తెలిపాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే వెంకీ మామ. అనుదీప్‌ డైరెక్షన్‌లో నటిస్తే థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయమని ప్రేక్షకులు భావించారు. కానీ అనుదీప్ చెప్పిన ఒక కథని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అనుదీప్ స్టైల్ లో నడిచే కామెడీ కాబట్టి అది వెంకటేష్ కి సింక్ అయ్యే రేంజ్ లో లేదనే ఉద్దేశ్యం తోనే ఆ కథని పక్కన పెట్టాడట. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దక్కెరయ్యే కథలను సెలెక్ట్ చేసుకోవాలని ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ హీరో అయిన వెంకటేష్ మాత్రం ఇప్పుడు వరుసగా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు కథలను వినిపిస్తున్నప్పటికి ఆయన సెలక్టెడ్ గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇకమీదట ఫ్లాప్ అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: