తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తిం పు కలిగిన నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు . ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో హీరో గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నా డు . ఆ తర్వాత అనుదీప్ కే వీ దర్శకత్వం లో రూపొందిన జాతి రత్నాలు అనే సినిమా లో హీరో గా నటించాడు. ఈ సిని మా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది . ఈ సినిమా తో నవీన్ పోలిశెట్టి క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది . అలా గే ఈ మూవీ ని రూపొందించి న విధానా నికి గాను అనుదీప్ కు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
ఇది ఇలా ఉంటే మరో సారి విరి కాంబో లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందబోయే సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించడం లేదు కానీ , కేవలం తాను కథను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి "అనగనగా ఓ రాజు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇకపోతే అనుదీప్ ఆఖరుగా శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరచింది. ప్రస్తుతం అనుదీప్ , విశ్వక్సేన్ హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి అనుదీప్ కథను అందించబోయే సినిమాలో నవీన్ నటించినట్లయితే ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంటుంది.