సీపీఐ నారాయణ: డైరెక్టర్ టార్చర్ వల్లే రష్మిక "పీలింగ్స్" సాంగ్ చేసింది..?

Pandrala Sravanthi
 పుష్ప టు పై ఇప్పటికే ఎన్నో విమర్శలు వెళ్లి వెత్తుతున్నాయి.చాలామంది రాజకీయ నాయకులు పుష్పటు పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  ఒక స్మగ్లింగ్ చేసేవాడు హీరోనా..ఎర్రచందనం దొంగ అంటూ ఇలా సెలబ్రిటీలు కూడా కొంతమంది అల్లు అర్జున్ ని పరోక్షంగా తిడుతున్నారు. ఇక రాజకీయ నాయకులు అయితే దొరికిందే సందు అనుకొని పుష్పటు పై అల్లు అర్జున్ పై సుకుమార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఒక స్మగ్లింగ్ చేసే ఎర్రచందనం దొంగతనం వాడికి నేషనల్ అవార్డు ఇస్తారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సిపిఐ నారాయణ పుష్ప టు సినిమాపై అల్లు అర్జున్ పై రష్మికపై సంచలన కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్లో ఫీలింగ్స్ అనే సాంగ్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ పాటలో రష్మిక కాస్త బోల్డ్ గా కనిపిస్తుంది. 

ఇక ఈ పాట కేవలం డైరెక్టర్, నిర్మాత టార్చర్ వల్లే రష్మిక చేసింది అంటూ సిపిఐ నారాయణ సంచలన కామెంట్ చేశారు. ఇలాంటి ఎంతోమంది మహిళలు డైరెక్టర్ల టార్చర్ తట్టుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ ఇలాంటి పాటల్లో చేస్తారు అంటూ రష్మిక గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. రష్మిక కూడా డైరెక్టర్ కోసమే పీలింగ్స్ సాంగ్ చేసినట్టు ఆమె చెప్పింది అన్నట్లు సిపిఐ నారాయణ మరోసారి గుర్తు చేశారు. ఎందుకంటే ఫీలింగ్స్ అనే సాంగ్ చేస్తున్నప్పుడు నేను కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యాను అంటూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమాలకు టికెట్ ధరలు పెంచితే కచ్చితంగా బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహించినట్టే అంటూ ఆయన సంచలన కామెంట్లు చేశారు.

అలాగే రేవతి కుటుంబానికి రెండు కోట్లు కాదు ఐదు కోట్లు అల్లు అర్జున్ ఇచ్చినా కూడా పోయిన ప్రాణం మళ్ళీ తీసుకురాలేడని ఆయన ఆరోపించారు. సమాజానికి సందేశం అందించేలా సినిమాలు తీయాలి కానీ స్మగ్లీంగ్,క్రైమ్, అశ్లీలత వంటి అంశాలను సినిమాల్లో చూపించకూడదు వాటిని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించకూడదు. ప్రొడ్యూసర్లు, దర్శకులు ఎవరైనా సరే కళామ తల్లి రేంజ్ పెరిగేలా సినిమాలు తీయాలి ఇలాంటి క్రైమ్ అశ్లీలతలను చూపిస్తూ సినిమాలు తీయకూడదు. అలాంటి సినిమాలను ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయకూడదు..అంటూ సిపిఐ నారాయణ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: